Big Shock To YS Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తాజాగా కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో వైఎస్ జగన్‌కు భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు వివరించేందుకు.. సమస్యలను ప్రజల ఇంటి వద్దనే పరిష్కరించడానికి రూపకల్పన చేసిన కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: YS Jagan: 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేనే 30 సంవత్సరాలు ఉంటా!'
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం అమలుచేసిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తాజాగా ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ కార్యక్రమాన్నిరద్దు చేస్తూ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ జీవో జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయం డైరెక్టర్ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ఆదేశాలు ఇచ్చారు.
Also Read: Delhi Exit Poll 2025: ఢిల్లీ మరోసారి ఆమ్‌ఆద్మీ పార్టీదే!.. ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళి ఇదే
అప్పుడే తీవ్ర అభ్యంతరం
అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్నాళ్లకు ఆ కార్యక్రమాన్ని అధికారికంగా అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు 2023లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా మార్చడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం తరఫున వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసినట్టు ఉందని నాటి ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వ అధికారులను పార్టీ కార్యకర్తలుగా వినియోగించుకున్నారని విమర్శలు వచ్చాయి. ఎన్నికల ముందు కూడా అధికారులతో జగన్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లి వివరించారు. అయినా కూడా వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయింది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడు నెలల తర్వాత జగన్ చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ పరిణామంతో జగన్, వైఎస్సార్‌సీపీకి ఓ షాక్ తగిలినట్టు అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.