Chandrababu Naidu: మందుబాబులు నాకే ఓటేయాలి: తిరుపతి ఉపఎన్నికలో చంద్రబాబు పిలుపు

Chandrababu Naidu: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారమంతా అసహనంతో, నిర్వేదనతో సాగింది. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందుబాబులంతా తనకే ఓటేయాలని పిలుపునివ్వడం విశేషం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2021, 01:40 PM IST
Chandrababu Naidu: మందుబాబులు నాకే ఓటేయాలి: తిరుపతి ఉపఎన్నికలో చంద్రబాబు పిలుపు

Chandrababu Naidu: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారమంతా అసహనంతో, నిర్వేదనతో సాగింది. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందుబాబులంతా తనకే ఓటేయాలని పిలుపునివ్వడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఉపఎన్నిక(Tirupati Bypoll)ల పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రచారం నిర్వహించారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కృష్ణాపురం ఠాణా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం ధరల్ని విపరీతంగా పెంచేశారని..అందుకే మందుబాబులంతా తనకే ఓటేయాలని పిలుపునిచ్చారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఏ మాత్రం ఆసక్తి లేదని..ప్రజాసేవే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. తాను నిర్మించిన హైదరాబాద్‌లో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ తయారైందన్నారు. తిరుపతి(Tirupati) లో ఐఐటి, కేంద్ర వర్శిటీని స్థాపించానని చెప్పుకొచ్చారు. 

అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రేణిగుంటలో వందకు పైగా పరిశ్రమలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అలాంటి తనను ఇటీవల అన్యాయంగా రేణిగుంట విమానాశ్రయంలో 9 గంటలు నిర్బంధించారన్నారు. తాను తలచుకుని ఉంటే వైఎస్ జగన్ ( Ys jagan) పాదయాత్ర చేసి ఉండేవారా అని ప్రశ్నించారు. తన సభలకు జనస్పందన బాగున్నా సరే..ఓట్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిలదీయడం వల్లనే ఆలయాలపై దాడులు తగ్గిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. బంగారు బాతు అయిన అమరావతిని మూడు రాజధానుల పేరుతో ధ్వంసం చేశారన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమాలకు రాయితీలిచ్చి..టికెట్ ధరలు పెంచుకోమని ప్రోత్సహించినట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా ఆదాయాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం టికెట్ ధరలు పెంచలేదన్నారు. ఈ ప్రాంతంలో పాయా బాగుంటుందని..దోసెలు బాగుంటాయని చెబుతున్నా సరే..జనం వెళ్లిపోతుండటంతో అసహనానికి గురయ్యారు. చివర్లో పోలీసులపై చిందులేసి..మీ అంతు చూస్తూనంటూ బెదిరించారు. 

Also read: Navaratnalu Calendar Release: సంక్షేమ పథకాల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News