ప్రవాసాంధ్రులకు సహాయ వారధిలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి బృందం దుబాయ్ చేరుకున్నారు. సాయంత్రం ఏపీఎన్ఆర్టీ నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. "మీరు ఒంటరి వాళ్లు కాదు.. మీ వెంట రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేను ఉంటాను. మీ కోసం మరెవరూ చేయని మంచి విధానాలను నేను చేస్తాను.."అని ప్రవాసాంధ్రులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు. ఈ సమావేశంలోనే సీఎం మూడు ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించి, 40 కోట్ల రూపాయలను కేటాయించారు.
సమస్యల్లో చిక్కుకున్న వారికి సహాయం అందించేందుకు 24 గంటల ప్రత్యేక హెల్ప్ లైన్, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొనేందుకు 'ప్రవాసాంధ్ర నిధి', ప్రమాదవశాత్తు చనిపోయినా, గాయపడినా ఆదుకొనేందుకు బీమా పథకం 'ప్రవాసాంధ్ర భరోసా' ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. భీమా పథకంలో భాగంగా, ప్రవాసాంధ్రుడు రూ. 50 ప్రీమియం చెల్లిస్తే చాలని, మిగితాది ప్రభుత్వమే చూసుకుంటుంది. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 10 లక్షలు, ఆరోగ్య భీమా కింద లక్ష రూపాయలు, న్యాయ ఖర్చులకు 45 వేల రూపాయలు చెల్లిస్తారని తెలిపారు.
Hon'ble CM Shri Nara Chandrababu Naidu launched Migrants' welfare policy & Introduced 3 new schemes for NRT's in UAE. pic.twitter.com/P6WrwsaM0V
— APNRT (@APNRTOfficial) October 21, 2017
Speaking to my fellow non-resident Telugu people at the @APNRTOfficial conference, Dubai pic.twitter.com/B5wuJ8pUAZ
— N Chandrababu Naidu (@ncbn) October 22, 2017