CMs Cup tourney and sports celebrations will start across andhra pradesh: దేశంలో చాలా ప్రతిభగల క్రీడాకారులున్నారు. అలాంటి వారిని గుర్తించి, మంచి శిక్షణ అందిస్తే దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదుగుతారు. ఈ క్రమంలోనే ఏపీలోని గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేలా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నీ(CM Cup tourney) నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్). దసరా (dussehra) నుంచి ఉగాది (ugadi) వరకు క్రీడా సంబరాలను నిర్వహించనుంది. మహిళల, పురుషుల విభాగంలో 13 క్రీడావిభాగాల్లో ఈ ఓపెన్ మీట్ నిర్వహించనుంది శాప్. మూడు నుంచి నాలుగు దశల్లో జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయి. ఫేజ్–1లో భాగంగా అథ్లెటిక్స్, (Athletics) ఖోఖో, వాలీబాల్ (Volleyball) పోటీలకు షెడ్యూల్స్‌ను ప్రకటించింది. మొదట ఈ నెల 20న శ్రీకాకుళం, (Srikakulam) 21న విశాఖపట్నంలో పోటీలు ప్రారంభం కానున్నాయి. అయితే సీఎం కప్‌లో తొలిసారిగా క్రికెట్‌ను చేర్చారు.
Also Read : Bride Wears 60 Kgs Gold : అరవై కేజీల బంగారంలా మారిన పెళ్లి కూతురు
175 నియోజకవర్గాల్లో పోటీలు..
ఇక ఈ పోటీల్లో 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల నుంచి క్రీడాకారులు పోటీపడనున్నారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జట్లకు మళ్లీ పోటీలు నిర్వహించి బహుమతుల ప్రదానం చేయనున్నారు. తర్వాత రాష్ట్ర స్థాయి (State level) పోటీలకు ప్రతిభ గల క్రీడాకారులతో జిల్లా జట్లను ఎంపిక చేస్తారు. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు.
క్రీడలు ఇవే...
అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ క్రికెట్ తదితర క్రీడల్లో ఏపీలో (AP) పోటీలు నిర్వహించనున్నారు.
Also Read : AP Theatres : ఏపీ థియేటర్లలో వందశాతం సీటింగ్‌కు అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook