Delhi Republic Parade: ఢిల్లీ రిపబ్లిక్ పరేడ్ లో ఏటికొప్పాక బొమ్మల శకటం.. ప్రత్యేకతలు ఇవే..!

Delhi Republic Parade: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రదర్శనకు ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటం ఎంపికైంది. తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఈ శకటానికి రూపకల్పన చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 24, 2025, 02:10 AM IST
Delhi Republic Parade: ఢిల్లీ రిపబ్లిక్ పరేడ్ లో ఏటికొప్పాక బొమ్మల శకటం.. ప్రత్యేకతలు ఇవే..!

Delhi Republic Parade: రాజధాని హస్తినలో ఈ నెల 26న గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఏటికొప్పాక బొమ్మల శకటానికి అనుమతి లభించింి.  ఇందులో ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వరస్వామి రూపం అందర్నీ ఆకట్టుకొనేలా ఉంది. ఇందులోనే వినాయకుడి ప్రతిమ, హరిదాసు, బొమ్మలకొలువు, చిన్నారుల ఆటపాటలకు సంబంధించిన చిత్రాలకు స్థానం కల్పించారు.

అనకాపల్లి దగ్గరలోని వరాహానది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామం పేరుతో ఈ బొమ్మలు ప్రసిద్ధి గాంచాయి. 2020 ఆగస్టు 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశీయంగా తయారయ్యే బొమ్మలను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ ఏటికొప్పాక బొమ్మల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెక్కతో తయారుచేసే ఈ బొమ్మల్లో ఎక్కడా వంపు కోణం కనపడకపోవడం విశేషం. ఏటికొప్పాకలాంటి పర్యావరణ అనుకూల బొమ్మలను ప్రోత్సహిద్దాం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అందులో పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారిగా 'శశక్త్ ఔర్ సురక్షిత్ భారత్' అనే థీమ్‌తో త్రి-ద‌ళాల‌ శకటం పాల్గొననుంది. ఈ మేర‌కు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. శశక్త్ ఔర్ సురక్షిత్ భారత్' అనే థీమ్‌తో ఈ శకటం సాయుధ దళాలలో ఉమ్మడిత్వం, సమైక్యత దృక్పథాన్ని ప్రదర్శిస్తుంది, ఇది జాతీయ భద్రత, కార్యాచరణ నైపుణ్యాన్ని నిర్ధారిస్తుంది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News