Delta Plus Case In AP: కరోనా వైరస్ కట్టడిలో సక్సెస్ అవుతున్నాయని ఏపీ సర్కారు భావిస్తున్న సమయంలో మరో కొత్త సవాల్ ఎదురైంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో నమోదవుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను సాధారణంగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఏపీలో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది.
రాష్ట్రంలో ఓవ్యక్తిలో తొలిసారిగా డెల్టా ప్లస్ కోవిడ్19 వేరియంట్‌ను గుర్తించిట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఏపీలో చిత్తూరు జిల్లాలో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైన విషయాన్ని మంత్రి తెలిపారు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తిలో డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఇటీవల గుర్తించగా, అతడికి చికిత్స కూడా పూర్తయిందని పేర్కొన్నారు. కరోనా బాధితుడి నుంచి ఇతరులకు డెల్టా ప్లస్ వేరియంట్ (Delta Variant of Covid-19) వ్యాప్తి చెందలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఫంగస్ కేసులతో పాటు, డెల్లా మరియు డెల్టా ప్లస్ కోవిడ్19 వేరియంట్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.
Also Read: COVID-19 New Wave: కరోనా కొత్త వేవ్ ఏర్పడేందుకు దారితీసే 4 పరిస్థితులు ఇవే
కొత్తగా నమోదయ్యే కేసుల పట్ల తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఓవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయగా, మరోవైపు గత కొన్ని రోజులుగా ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ఒకేరోజులో 13 లక్షలకు పైగా డోసుల వ్యాక్సినేషన్‌తో ఏపీ ప్రభుత్వం రికార్డుల మోత మోగించింది. కోవిడ్19 నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరా, కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook