Srikalahasti Maha Shivaratri: శ్రీకాళహస్తి అంటే ఏ భక్తుడికైనా మూడు మూగజీవాలతో పాటు గుర్తుచేది భక్త కన్నప్ప . తన కన్నులను ముక్కంటిశునికి ఇచ్చి మోక్షం పొందిన వేటగాని వృత్తాంతం ఎవరికైనా గుర్తుకొస్తుంది. ఇక్కడ ఆలయంలో నిర్వహించే పూజల లో అగ్ర తాంబూలం కైలాస నాథుడు తన భక్తుడైన భక్తకన్నప్పకు ఇచ్చాడు. తాను కొండ కింద వెలసి తన భక్తుడు భక్తకన్నప్పకు.. కైలాసగిరి పర్వత పంక్తులో శిఖరాగ్రం లో అవకాశం కల్పించాడు. దీనిని బట్టి శివయ్య భక్తులకు ఎంతటి ప్రాధాన్య ఇస్తాడనేది అర్థమవుతుంది.
ఆలయంలో వెలసిన మూల విరాట్ కు హారతి ఇచ్చిన తరువాత అర్చకులు కన్నప్ప విగ్రహాన్ని చూపుతారు. దాన్ని బట్టి భక్త కన్నప్ప ప్రాధాన్యత ఎంటో అర్థమవుతుంది. ఈ విశేషాల వల్లనే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో మొదట భక్తు డైనటువంటి భక్తకన్నప్పకు పూజల నుంచి ధోజారోహణముతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
కార్యక్రమానికి స్థానికంగా ఉన్న భక్తులు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తులు కొండపై నలుమూలల నుంచి వీక్షించారు. సాధారణంగా బ్రహ్మోత్సవాలు అంటే ఏ ఆలయములైన పది రోజులు నిర్వహిస్తారు. కానీ శ్రీకాళహస్తీలో మాత్రం 13 రోజులపాటు ప్రత్యేకంగా న నిర్వహించటం సాంప్రదాయం.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.