విశాఖ మన్యంలో ఉద్రిక్తత: ఎమ్మెల్యే కిడారి హత్య కేసులో పలువురు గిరిజనుల అరెస్ట్ ?

                

Last Updated : Sep 26, 2018, 06:52 PM IST
విశాఖ మన్యంలో ఉద్రిక్తత: ఎమ్మెల్యే కిడారి హత్య కేసులో పలువురు గిరిజనుల అరెస్ట్ ?

విశాఖ: అరకు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హత్య కేసును చేధించడం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసును చేధించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మావోలను ఏరివేసేందుకు విశాఖ మన్యంలో భద్రతాబలగాలు భారీ సంఖ్యలో ఆపరేషన్ చేపడుతూన్నారు. దీంతో విశాఖ మన్యంలో ఉద్రిక్త వాతావరణం  నెలకొంది. ఈ నేపథ్యంలో స్థానికులు భయంభయంగా బతుకుతున్నారు. 

గ్రామస్తులపై పోలీసుల అనుమానం
గిరిజనుల సాయంతో పక్కా ప్రణాళికతోనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలపై దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేవలం 150 మంది ఉండే ఈ ఊరిలో పదుల సంఖ్యలో మావోయిస్టులు చొరబడినప్పటికీ గ్రామస్తులకు ఎలా తెలియకుండా ఉంటుందనేది పోలీసుల ప్రశ్న. ఈ క్రమంలో స్థానికులు సాయంతోనే దాడి జరిగిందని అనుమానంతో పలువురు గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం మొత్తం 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విచారణలో భాగంగా లివిటిపుట్టులోని గిరిజనుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు ..వీరిందరినీ ఈ మేరకు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా హత్య కేసులో గిరిజనులు తీసుకెళ్లడంపై వారి కుటంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు..మావోయిస్టులతో తమకు ఎలాంటి సంబంధాల లేవని వాపోతున్నారు.

Trending News