Akkineni Akhil: అఖిల్ అక్కినేని పెళ్లి తేది ఫిక్స్..!.. నాగార్జున ఇంట్లో పెళ్లి పనులు షురూ..?.. సంబరాల్లో అక్కినేని ఫ్యాన్స్..

Akhil Zainab Rawji Wedding date:  అక్కినేని అఖిల్, జైనబ్ లో పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తొంది. దీంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పుకొవచ్చు.
 

1 /8

అక్కినేని కుటుంబంతో గతేడాది వరుసు శుభకార్యాలు జరిగాయి. తొలుత చైతు ఎంగెజ్ మెంట్, ఆతర్వాత అఖిల్ ఎంగెజ్ మెంట్, చైతు,శొభితల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.  

2 /8

ఇదిలా ఉండగా.. శోభిత  అక్కినేని కోడలుగా వెళ్లినప్పటి నుంచి నాగార్జున ఇంట్లో వరుసగా గుడ్ న్యూస్ లు వార్తలలో ఉంటున్నారు. తాజాగా.. శోభిత మరో ఇన్ స్టాలో ఒక గుడ్ న్యూస్ చెప్పారు.

3 /8

తాను నటించిన మంకీ మ్యన్ మూవీ.. బాఫ్టా ఆమోదం పొందడంతో పాటు.. రాటెన్ టోమాటస్ బెస్ట్ రివ్యూడ్ మూవీగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా శోభిత ఇన్ స్టాలో వెల్లడించారు. 

4 /8

అయితే.. ఇప్పటికే అక్కినేని అఖిల్ , జైనబ్ రవ్జీల ఎంగెజ్ మెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో అక్కినేని కుటుంబం నుంచి మరో శుభవార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

5 /8

నాగార్జున చిన్న కొడుకు అఖిల్, జైనబ్ ల పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు వార్తలు ఊపందుకున్నాయి. మార్చి 24న వీరి పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ లు కూడా షురు చేశారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  

6 /8

చైతు పెళ్లి సింపుల్ గా కొద్ది మంది అతిథులు, బంధువుల మధ్యలో జరిగిపోయింది. కానీ అఖిల్ పెళ్లి మాత్రం ధూంధాంగా జరిపేందుకు నాగార్జున ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుంచి అందర్ని పురామయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   

7 /8

ఇక అఖిల్, జైనబ్ ల ప్రేమ..దగ్గు బాటి రాణా, మిహికల పెళ్లిలో స్టార్ట్ అయ్యిందని కూడా అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. జైనాబ్ మిహీకా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో  అఖిల్ కి కూడా పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారటం జరిగిందని తెలుస్తుంది.  

8 /8

 సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా  తెరంగెంట్రం చేసిన అఖిల్.. మజ్ను, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచీలర్, అఖిల్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.  2023 లో చేసిన ఏజెంట్ లో భారీ డిజాస్టర్ ను సొంతం చేసుకున్నాడు.