Hidden Camera Scandal Latest News: కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన లేడీస్ హాస్టల్‌లో రహాస్యంగా ఉంచిన కెమెరా చిక్కడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఆ కాలేజీ అమ్మాయిల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయింది. దీని వెనుక ఎవరు ఉన్నా వదిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించామన్నారు. దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజాగా ఈ ఘటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకున్న అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందనిక ట్వీట్ చేశారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే.. వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనమని ఫైర్ అయ్యారు.
కాలేజీల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి సజీవ సాక్ష్యమని వైఎస్ షర్మిల మండిపడ్డారు. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్ఫణమని.. కాసుల కక్కుర్తి తప్పా భద్రత ప్రమాణాలు గాలికి వదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అని అన్నారు. ఈ ఘటనపై సాధారణ విచారణ వద్దని.. ఫాస్ట్రాక్ విచారణ జరగాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయాలని కోరారు. బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలన్నారు. కెమెరాలు పెట్టింది ఎవరైనా.. ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేనన్నారు. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే తాను కాలేజీని సందర్శిస్తానని.. న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు.
Also Read: Chamakura Malla Reddy: మస్త్ పరేషాన్‌లో మల్లన్న.. పార్టీ మారుతారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.