AP Weather: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ హెచ్చరిక.. ఐదు రోజులు ఇంట్లోనే ఉండాలి

High Alerted Disaster Management To Puplic: తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్య్సకారులు పూర్తిగా అప్రమత్తం ఉండాలని.. లేదంటే తీవ్ర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 20, 2024, 05:55 PM IST
AP Weather: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ హెచ్చరిక.. ఐదు రోజులు ఇంట్లోనే ఉండాలి

Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లేకపోతే చాలా నష్టం ఏర్పడుతుందని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. తుఫాను ఏర్పడే అవకాశం ఉండడంతో జాలర్లతోపాటు సామాన్య ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: Pithapuram: జనసేనాని మాటంటే శాసనమే! చిన్నారుల దాహార్తి తీర్చిన డిప్యూటీ సీఎం

ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దాని ప్రభావంతో  రానున్న 24 గంటల్లోపు తూర్ పుమధ్య ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 22వ తేదీ ఉదయం నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 23వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది.

Also Read: YS Jagan: 'దిశా' లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం

తుఫానుగా ఏర్పడి వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24వ తేదీ ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావం కారణంగా అక్టోబర్ 24, 25వ తేదీల్లో రెండు రోజులు ఉత్తరాంధ్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

తీవ్రస్థాయిలో గాలులు
అక్టోబర్ 23, 24వ తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గంటకు 45-65 కిలో మీటర్ల వేగంతో  ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 24వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని పిలుపునిచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News