Rain Alert: బంగాళాఖాతంలో దక్షిణ తమినాడు, శ్రీలంక తీరాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న 3 రోజుల్లో వివిధ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలకు రానున్న మూడు రోజులు వర్షసూచన జారీ అయింది. ఉత్తర కోస్తా, యానాంలో ఇవాళ, రేపు, సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడవచ్చు. రేపు అంటే ఆదివారం, సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఇక రాయలసీమలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుంది. ఇక అదివారం, సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
మరోవైపు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. అదే విధంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనుంది. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల, ఉమ్మడి మెదక్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.
Also read: US Elections 2024: ఈసారి స్వింగ్ స్టేట్స్ ఎవరివైపు, బ్లూ వర్సెస్ రెడ్ స్టేట్స్ ట్రెండ్ మారుతోందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.