Pawan Kalyan Comments: ఏపీలో పొత్తు అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీని ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పాటు కాబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా సార్లు మనం తగ్గామని..ఈసారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందన్నారు.
2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీతో కలిసి ముందుకు వెళ్లామని..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పుడు మన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయన్నారు. ఒకటి ..బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. రెండు..బీజేపీ, టీడీపీ కలిసి అధికారంలోకి రావడం..మూడు..జనసేన ఒక్కటే రంగంలోకి దిగడం. 2024 ఎన్నికల్లో మాత్రం మనము తగ్గేందుకు సిద్ధంగా లేమన్నారు. పరోక్షంగా ఒంటరిగా పోటీ చేస్తుందన్న సంకేతాలు ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలే గెలవాలన్నారు. పొత్తుల అంశాన్ని జనసైనికులంతా లైట్‌గా తీసుకోవాలన్నారు. దీనిని అంతా సీరియస్‌గా తీసుకోకుండా పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. కులరహిత సమాజం కోరుకునే పార్టీ తమది అని స్పష్టం చేశారు. ఈసందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదు అని అన్నారు.
కోనసీమలో కులాల మధ్య ఘర్షణ నివారించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. కోనసీమ అల్లర్ల వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడతారా అని ప్రశ్నించారు. కుల ప్రభావిత రాజకీయాలు ఆపాలనే 2014లో బీజేపీ,టీడీపీతో కలిసి వెళ్లాలని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రమేయం లేని తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం ఏంటని అని మండిపడ్డారు.
Also read: Odisha Cabinet: ఒడిశాలో కేబినెట్ విస్తరణకు వేళాయే..కొత్త మంత్రులు వీరే..!
Also read: Corbevax: దేశంలో బూస్టర్ డోస్‌గా కార్బెవాక్స్..డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook