విజయవాడ: బెజవాడ టీడీపీలో రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొంతమంది నేతల వైఖరి నచ్చని టీడిపి ఎంపి కేశినేని నాని.. ట్విటర్ ద్వారా నేరుగా చంద్రబాబుకే ఘాటైన మెసేజ్ ఇచ్చారు. తాను పార్టీకి వద్దనుకుంటే చెప్పండి.. పార్టీకి, ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తానంటూ ట్విట్టర్ వేదికగా కేశి నాని తేల్చిచెప్పారు. ''చంద్రబాబు గారూ.. నాలాంటి వాళ్లు పార్టీలో వద్దనుకుంటే చెప్పండి.. ఎంపీ పదవికి, పార్టీకి వెంటనే రాజీనామా చేస్తా. నా లాంటి వాళ్లు పార్టీలో కొనసాగాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను కంట్రోల్ చేయండి'' అని నాని చేసిన ట్వీట్ బెజవాడ రాజకీయాల్లోనే కాకుండా మొత్తం టీడీపీలోనే చర్చనియాంశమైంది.
Chandra Babu Garu if you don't want people like me in the party you can let me know I will resign as Member of Parliament and also to the Party membership.
If you want people like me to continue please control your pet dog.— Kesineni Nani (@kesineni_nani) July 15, 2019
కేశినేని నాని చేసిన ఈ ట్వీట్‌తో ఆయన ఇక అటో ఇటో తేల్చుకోవాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. ట్విటర్ ద్వారా చంద్రబాబుకు ఘాటైన సందేశాన్ని ఇచ్చిన కేశినేని నాని.. అంతకన్నా ముందుగా తన ప్రత్యర్థులపై ఇంకొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు
గుళ్ళో కొబ్బరిచిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి,కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం.
నాకు అవసరం లేదు...— Kesineni Nani (@kesineni_nani) July 14, 2019
"రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు, గుళ్లో కొబ్బరి చిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం. నాకు అవసరం లేదు" అంటూ నాని చేసిన ట్వీట్ సృష్టించిన రాజకీయ కలకలం ఇంకా సద్దుమణగకముందే ఈసారి చంద్రబాబుకే నిర్ణయాన్ని వదిలేస్తూ ఆయన చేసిన మరో ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది.