నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో బస చేసిన చంద్రబాబుని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేసినట్టుగా ప్రకటించిన పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని ఏపీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో బస చేసిన చంద్రబాబుని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేసినట్టుగా ప్రకటించిన పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు.
చంద్రబాబు తరపు విజయవాడ ఏసీబీ కోర్టులో సుప్రీం సీనియర్ న్యాయవాది సిద్దార్థా లుధ్రా వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబు తరపు వాదనలు వినిపించేందుకు గాను సిద్దార్థా లుధ్రా తన న్యాయవాదుల బృందంతో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్నారు.
2014-2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ పేరుతో కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణలో భాగంగా కోట్లాది రూపాయల అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ.
అప్పటి ప్రభుత్వం జర్మనీకు చెందిన సీమెన్ సంస్థతో 3,350 కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించాల్సిన పది శాతంలో 240 కోట్లను దారి మళ్లించినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా నకిలీ బిల్లులతో జీఎస్టీకు కూడా ఎగనామం పెట్టారని మరో ఆరోపణ ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ 26 మందికి నోటీసులు కూడా జారీ చేసింది.
చంద్రబాబుపై నమోదైన సెక్షన్లు
120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ మరియు 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో నాన్ బెయిలబుల్ నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నట్టుగా చంద్రబాబుకు ఏపీసీఐడీ నోటీసు జారీ చేసింది.
మరోవైపు ఇదే కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో గుంటూరుకు చెందిన ఘంటా సుబ్బారావు, డాక్టర్ కే లక్ష్మీ నారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ పేర్లు మొదటి మూడు అనుమానితులుగా పేర్కొన్నారు.
ఇవాళ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టు చేశారు. 120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ మరియు 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) కేసు నమోదు చేశారు