Madhavi latha fires on jc prabhakar reddy: ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీతో పాటు, ఇండస్ట్రీలో కూడా వివాదాన్ని రాజేసినట్లు తెలుస్తొంది. అయితే.. తాడి పత్రిలోని పెన్నానదిలో ఒడ్డున ఉన్న జేసీ పార్కులో.. డిసెంబరు 31న మహిళలకు మాత్రమే అంటూ న్యూయర్ వేడుకలు నిర్వహించారు. దీనిపై నటి మాధవీలత మాట్లాడారు. రాత్రి పూట అక్కడ గాంజా బ్యాచ్ లు ఉండొచ్చని, మహిళల, మాన, ప్రాణాలకు సెక్యురిటీ ఏంటని కూడా ఆవేదన చెందారు. తాడిపత్రి మహిళలు ఎవరు కూడా వెళ్లొద్దని అన్నారు.
ఈ క్రమంలో దీనిపై తాజాగా.. తాడి పత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మాధవీలత ఒక వ్యభిచారి అని సంభోదించారు. అంతే కాకుండా.. ఆమెను బీజేపీ వాళ్లు ఎలా పార్టీలో పెట్టుకున్నారని.. వేరే వాళ్లు దొరకలేదా అంటూ బాంబు పేల్చారు. ఈ క్రమంలో మాధవీలతపై జేసీ కామెంట్స్ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై పట్టణ మహిళలకు అవమానం జరిగేలా మాట్లాడారని అన్నారు.
ఈ మేరకు.. మాధవీలతపై తాడిపత్రిలో పోలీసు స్టేషన్‌లో రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కుంకరి కమలమ్మతో పాటు టీడీపీ మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలుస్తొంది. దీనిపై తాజాగా.. నటి మాధవీలత స్పందించారు. తాను మహిళల ఆత్మ గౌరవం కోసం మాట్లాడినట్లు చెప్పారు. అంతే కాకుండా.. ఒక వయసులో పెద్దాయన మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదన్నారు.
Read more: JC Vs Madhavi latha: మాధవీ లతపై జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. దిమ్మతిరిగే కౌంటర్లు..
అదే విధంగా సినిమాలో అందరు వ్యభిచారులు ఉండరన్నారు. అలా ఉంటే.. తాడి పత్రి నుంచి సినిమా రంగంలోకి ఎవరు రాకూడదన్నారు. దీనిపై తాను.. వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని.. తనను కిడ్నాప్ చేసిన.. హతమార్చేందుకు కుట్రలు చేసిన దేనీకైన భయపడనని.. కర్మ ఎవర్ని వదలదని కూడా మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డికి మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.