Anam Ramanarayana Reddy: సీసీ ఫుటేజ్ ఉంది.. వైఎస్‌ జగన్‌పై మంత్రి సంచలన ఆరోపణలు

Anam Ramanarayana Reddy on EX CM YS Jagan: మాజీ సీఎం జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ అహంకార దర్పంతో హాస్పిటల్‌లోకి వందల మందితో వచ్చి.. చికిత్స పొందుతున్న వారిని ఇబ్బందులకు గురిచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 10, 2025, 08:03 PM IST
Anam Ramanarayana Reddy: సీసీ ఫుటేజ్ ఉంది.. వైఎస్‌ జగన్‌పై మంత్రి సంచలన ఆరోపణలు

Anam Ramanarayana Reddy on EX CM YS Jagan: మృగాల మధ్య తిరిగేవాళ్లు జనాల మధ్య తిరుగుతున్నారని మాజీ సీఎం జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దురదృష్టవశాత్తు తిరుపతిలో జరిగిన సంఘటనను రాజకీయంగా వాడుకునే విధంగా వైసీపీ నేతలు, జగన్ వ్యహరించారని మండిపడ్డారు. ఆసుపత్రిలో 18 మంది బాధితులకు 18 కవర్లు ఇచ్చి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడాలని వైసీపీ ముఖ్య నేత సూచించడం సీసీ కెమెరాలు కూడా రికార్డు అయిందని తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలు వైసీపీ నేతలకి చెందుతుందని మండిపడ్డారు. అందుకే ఐదేళ్ల కాలంలో వారిని ప్రజలు చూసి ఇంటికి పంపించారన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా దేవాలయాల్లో నాణ్యత కలిగిన ప్రసాదాలను అందిస్తున్నామని.. గత ప్రభుత్వం ప్రసాదాలను నాశనం చేసిందని విమర్శించారు.

హిందుత్వ హైందవ ధర్మాలను జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని.. కూటమి ప్రభుత్వం వాటిని ఆచరణలో తీసుకొచ్చి హిందూ సమాజానికి మళ్లీ ఊపిరి పోసిందని మంత్రి ఆనం అన్నారు. అలాగే బ్రాహ్మణులకు వేదం చదివే వాళ్లకు కూడా సంభావన కింద మూడేళ్ల పాటు మూడు వేల నగదు ఇస్తామని తెలిపారు. ముక్కోటి ఏకాదశి వైష్ణవాలయలలో అంగరంగ వైభవంగా  జరిగిందని చెప్పారు. 

"తిరుపతి ఘటన చాలా బాధాకరం.. సీఎం చంద్రబాబు అధికారులు తీరుపై తప్పు బట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధ పడ్డారు. విశాఖ లో 2.08వేల కోట్లు అభివృద్ధికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. దేవాదాయ, హోమ్, రెవిన్యూ శాఖల మంత్రులు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించాం. ఒక్క మహిళా కోసం ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 9 సెంటర్లు.. 95 కౌంటర్లు గతంలో చేశాం కాబట్టి ఇపుడు ఇదే చేశామని సీఎంకు అధికారులు చెప్పడం బాధాకరం. 35 మంది బాధితులను సీఎం నేరుగా కలిశారు. ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తాం.

రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలేని జగన్ వచ్చి పరామర్శించారు. అహంకార దర్పంతో జగన్ హాస్పిటల్‌లోకి వందలకొద్ధి ప్రవేశం చేసి చికిత్స పొందుతున్న వారిని ఇబ్బందులకు గురిచేశాడు. ముఖ్యమంత్రి కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంది. రోగులకు ఉన్న సెలైన్లు స్టాండ్‌లు వైసీపీ నేతలు పక్కకు నెట్టేయడం అందరూ చూశారు. ఇలాంటి రాకీయ పార్టీలు రాష్ట్రంలో ఉడటం సిగ్గుచేటు. కవర్లు ఇచ్చి చంద్రబాబుపై చెడుగా చెప్పమనడం.. అసత్య ఆరోపణలు చేయాలనడం హేయం. అత్యంత నీచ స్థితికి జగన్ దిగజారారు. 18 మందిని వైసీపీ వాళ్లు కలవడం.. కవర్లు ఇవ్వడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ది రాలేదు.." అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు.

Also Read: Pawan kalyan: టీటీడీ పాలక మండలి క్షమాపణ  చెప్పాల్సిందే... కొండంత విషాదంపై  పవన్ కళ్యాణ్ హుకుం.. వీడియో వైరల్..  

Also Read: Bandi Sanjay: కేటీఆర్ ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడివా..? కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమే: బండి సంజయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News