టీడీపీ- బీజేపీ మధ్య మాటల యుధ్ధం తారా స్థాయికి చేరిన ఈ తరుణంలో బీజేపీకి చెందిన మంత్రి కామినేని భిన్నంగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే జతకడమని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి కామినేని మాట్లాడుతూ టీడీపీ-బీజేపీ మధ్య నెలకొన్న వివాదం త్వరలోనే సమసిపోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే ఉంటామని..జగన్ తో జతకట్టే పశ్నేలేదని తేల్చి చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
ఏపీకి అందాల్సిన నిధులు విషయంలో బీజేపీ - టీడీపీకి మధ్య ఇటీవలే గ్యాప్ పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావు తో సహా పలువురు బీజేపీ నేతలు టీడీపీతో తాడో పేడో అన్నట్లు మాట్లాడారు. దీనికి టీడీపీ నేతల నుంచి కూడా అదే స్థాయిలో మాటల దాడి నడిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ బంధం ఎక్కువ రోజులు కొనసాగదని ఆలోచనలో ఉన్న తరుణంగా బీజేపీకి చెందిన మంత్రి కామినేని భిన్నంగా స్పందించడం చర్చనీయంశంగా మారింది.