విజయవాడ కేంద్రంగా వైసీపీ సర్కార్ నిర్వహించిన తొలి పెట్టుబడుల సదస్సులో సీఎం జగన్ మాట్లాడిన తీరును మాజీ మంత్రి నారాలోకేష్ ఎద్దేవా చేశారు. పారిశ్రామిక ప్రతినిధులను ఉద్దేశించి ఒకనొక సందర్బంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... ఈ రాష్ట్ర పరిస్థితి గురించి మీకు తెలిసే ఉంటుంది..తమది అంతగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెప్పులేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఇదే అంశాన్ని నారా లోకేష్ ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్ గారూ మా మీద కోపంతో రాష్ట్రాన్ని తక్కువ చేసి చెప్తున్నారేంటి ? అంటూ ప్రశించారు.. చెప్పాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనతల గురించి గర్వంగా చెప్పండి..కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల నష్టపోతామని సీఎం జగన్ కు లోకేష్ కౌంటర్ ఇచ్చారు.
.@ysjagan గారూ.. మా మీద కోపంతో రాష్ట్రాన్ని తక్కువ చేసి చెప్తున్నారేంటి? మన ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనతల గురించి గర్వంగా చెప్పండి..
For more details, click on the link:https://t.co/tF8fLT4MXk pic.twitter.com/Gk48hooPds
— Lokesh Nara (@naralokesh) August 10, 2019
ఇదిలా ఉంటే లోకేష్ వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులు ఖండిస్తున్నారు. జగన్ వ్యాఖ్యలు పూర్తిగా చూపించకుండా కట్ చేశారని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో పరిస్థితి దారుణంగా తయారైందని..అందువల్ల ఇక్కడ అభివృద్ధి జరగలేదనే సత్యాన్ని జగన్ బయటపెట్టారన్నారు. ఏపీలో మానవ వనరులు మౌలిక వసతులకు కొదవ లేదని ..పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వైసీపీ సర్కార్ అన్ని విధాలుగా సహకరిస్తుందనే కోణంలో పరిశ్రమల ప్రతినిధులను ఆకర్షించేలా జగన్ ఇలా మాట్లాడారని ..దీన్ని కూడా వక్రీకరించడం దారుణమని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు