Pawan kalyan asking apology to Tirumala stampede victims family: తిరుమలలో ఇటీవల వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ..టోకెన్ల జారీ చేసే క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. 40 మందికి పైగా మరణించారు.ఈ ఘటనలో.. టీటీడీ, పోలీసులు మాత్రం పూర్తిగా వైఫల్యం చెందాయని స్పష్టంగా తెలుస్తొంది. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. అదే విధంగా ఘటన స్థలానికి వెళ్లి ప్రమాదంకు గల కారణాల్ని అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా బాధితులు ఉన్న ఆస్పత్రికి వెళ్లి.. అక్కడ ప్రతి ఒక్క బాధితులతో ఓపిగ్గా మాట్లాడి.. ఘటన ఎలా జరిగింది.. బాధితుల ఆరోగ్య పరిస్థితులు వారితోనే మాట్లాడి తెలుసుకున్నారు. బాధితులకు తమ సర్కారు.. అండగా ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా.. చంద్రబాబు ఘటన తర్వాత బాధితులకు అన్నివిధాలుగా తాము అండగా ఉంటున్నామని భరోసా ఇస్తునే.. మరోవైపు తప్పిదాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు ఉపక్రమించారు.
అదే విధంగా ఈ తప్పు టీటీడీ వల్ల జరిగిందా.. లేదా పోలీసులు అధికారుల వల్ల జరిగిందా..పక్కనపెడితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ప్రవర్తించిన తీరు పట్ల ప్రజలు మాత్రం ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై ఏ మాత్రం భేషజాలకు, ఈగోలకు పోకుండా.. బహిరంగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఘటనకు క్షమాపణలు కోరారు.
మరోసారి ఇలాంటి ఘటనలో జరక్కుండా చూస్తామన్నారు. అంతే కాకుండా.. బాధితుల దగ్గరకు వెళ్లి మరీ ఆయన మాట్లాడి.. ఒక డిప్యూటీ సీఎం,అంతకు ముందు ఒక పవర్ స్టార్ అయి ఉండి కూడా.. సామాన్యుడిలా.. భాధితుల కాళ్ల దగ్గర కూర్చుని ఆయన క్షమాపణలు కోరడం ప్రస్తుతం సోషల్ మీడియాలో, రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read more: Allu Arjun: పండగకు ముందే అల్లు అర్జున్‌కు గుడ్ న్యూస్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు..
ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండాలని.. ప్రజలకు నాయకులు ఎల్లప్పుడు కూడా.. సేవకులే.. అన్న ఒక మంచి మెస్సెజ్ ను పవన్ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా టీటీడీ అధికారులచేత కూడా ఘటనపై..క్షమాపణలు చెప్పించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం ప్రవర్తించిన తీరు మాత్రం.. నిజమైన లీడర్ అంటే ఇలాగే ఉంటాడ్రా అంటూ.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చర్చించుకుంటున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter