Polavaram Project Update: పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యే విధంగా ముందుకు సాగుతోంది. వరదలు, కరోనా విపత్కర పరిస్థితులున్నా సరే..పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కీలకమైన గ్యాప్ 3 డ్యామ్ నిర్మాణం పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనరేఖ, బహుళార్ధసాధక ప్రాజెక్టు పోలవరం డ్యామ్(Polavaram Dam) నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిర్మాణ పనులు ముందుకే సాగుతున్నాయి. ఇందులో భాగంగా పోలవరం డ్యామ్ గ్యాప్ 3 నిర్మాణం పూర్తయింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ గ్యాప్ -3 నిర్మాణాన్ని పూర్తి చేసింది. 153.50 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తు, 8.50 మీటర్ల వెడల్పులో ఈ గ్యాప్ 3 కాంక్రీట్ నిర్మాణం పూర్తయింది. గ్యాప్ 3 డ్యామ్ నిర్మాణంలో 23 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు.
2019లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) పనుల్ని ప్రారంభించగా..కీలకమైన స్పిల్ వే (Spill way)నిర్మాణం పూర్తయింది. స్పిల్ వేలో అమర్చాల్సిన 48 రేడియల్ గేట్లలో 42 గేట్లను ఇప్పటికే అమర్చారు. మరో 6 గేట్లను అమర్చాల్సి ఉంది. ఇక రేడియల్ గేట్లకు అనుసంధానంగా అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలెండర్లలో 84 సిలెండర్లను అమర్చారు. 24 పవర్ ప్యాక్‌లు పూర్తయ్యాయి. ఇప్పటికే అన్ని గేట్లను తెరిచి ఉంచడంతో..గోదావరి వరద నీరు తొలిసారిగా గేట్ల నుంచి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. డ్యామ్‌కు సంబంధించిన 10 రివర్ స్లూయిజ్ గేట్లను అమరిక పూర్తయింది. స్పిల్ వే ఛానెల్లో 2 లక్షల 41 వేల 826 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. అప్రోచ్ ఛానెల్‌కు సంబంధించి 70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇది పూర్తయింది. ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద అడ్డుకట్ట వేసి గోదావరి నదీ ప్రవాహాన్ని మళ్లించే ప్రక్రియ పూర్తయింది. అప్రోచ్ ఛానెల్ నుంచి స్పిల్ వే మీదుగా గోదావరి నదిని దాదాపు 6.6 కిలోమీటర్ల మేర మళ్లించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా 11 లక్షల 96 వేల 5 వందల క్యూబిక్ మీటర్ల వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి కొండ తవ్వకం పనులు పూర్తయ్యాయి. జల విద్యుత్ ప్రాజెక్టులో(Polavaram Power Plant) ఫ్రైజర్ టన్నెల్స్ తవ్వకం జరుగుతోంది.
Also read: Ganesh chaturthi in AP: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై AP High court నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook