బీజేపీ పోరు బాట; సీమలో రెండో రాజధాని ఏర్పాటు డిమాండ్

Last Updated : Feb 23, 2018, 03:36 PM IST
బీజేపీ పోరు బాట; సీమలో రెండో రాజధాని ఏర్పాటు డిమాండ్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ రోజు  రాయలసీమకు 'సంబంధించిన డిక్లరేషన్ ను ప్రకటిచింది. కర్నూలు వేదికగా జరిగిన సమావేశంలో ఈ మేరకు  డిక్లరేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా సీమలో రెండో రాజధాని ఏర్పాటు , హైకోర్టు నిర్మాణం డిమాండ్లు ఉన్నాయి.  రాయలసీమకు సంబంధించిన బీజేపీ డిక్లరేషన్ ను ఒక్కసారి పరిశీలిద్దాం

సీమ ప్రాంత బీజేపీ డిక్లరేషన్: 
* సీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలి
* హైకోర్టు సీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి
* రాయలసీమ అభివృద్ధి బోర్డు పున: ప్రారంభించాలి
* రాయలసీమను 8 జిల్లాలుగా విభజించాలి
* నాలుగేళ్ల పాలనలో సీమకు సంబంధించిన కేటాయింపులు ప్రకటించాలి
* రూ.10 వేల కోట్లు సీమ ఇరిగేషన్ కు కేటాయించాలి
* వచ్చే బడ్జెట్ రూ.20 వేల కోట్లు సీమ ప్రత్యేక నిధి కింద కేటాయించాలి
*  ఆరు నెలలకు ఒక సారి సీమలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి

ఈ డిమాండ్ సాధన కోసం ఈ నెల 28 నుంచి కడప జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది.

Trending News