Sankranti 2023 Celebrations సంక్రాంతి పండుగను ఒక్కో చోట ఒక్కోలా పిలిచినా.. సంక్రాంతి పండుగ అంటే మాత్రం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తుకు వస్తాయి. అందులోనూ మరీ ముఖ్యంగా ఏపీ గుర్తకు వస్తుంది. తెలంగాణకు దసరా ఎలానో.. ఏపీకి సంక్రాంతి అలాంటి సందడి ఉంటుంది. ఇక సంక్రాంతి సందడిని చూడాలంటే మాత్రం కచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే. అక్కడే సంక్రాంతి సందడంతా కనిపిస్తుంటుంది. ఇక ఏపీ అంతటా కూడా ఈ సారి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలుస్తోంది.
అచ్చమైన తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులాటలు, జానపద సాంప్రదాయ కళారీతుల ప్రదర్శనలు ఏర్పాటు చేయబోతోన్నారు. ఇక వివిద నగరాల్లో నోరూరించే సాంప్రదాయ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించబోతోన్నారు. సంక్రాంతి సందర్భంగా స్పెషల్‌గా పాపికొండల టూర్ ప్యాకెజ్ ఉందట. పర్యాటకులు కూడా అక్కడ బోటింగ్ కు క్యూ కడుతున్నారని తెలుస్తోంది.
టూరిస్ట్ స్పాట్, అక్కడి హోటళ్ళు, రెస్టారెంట్లు కూడా సంక్రాంతి సందడికి రెడీ అవుతున్నాయి. భద్రాచలం వైపున పోచవరం, దేవి పట్నం, గండి పోచమ్మ బోటింగ్ పాయింట్ల నుండి 29 బోట్లు రాకపోకలు కొనసాగించనున్నాయట. పాపికొండల యాత్రకు కూడా ఫుల్ డిమాండ్ కనిపిస్తుంది. ఏపీ శిల్పారామం, ఏపీ టిడిసి సంక్రాంతి సంబరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయబోతోన్నాయని తెలుస్తోంది.
వైజాగ్, విజయనగరం, కాకినాడ, తిరుపతి, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, శిల్పారామాలలో ఈనెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించనున్నారని తెలుస్తోంది. చేతివృత్తి కళాకారుల స్టాల్స్ ఏర్పాటు చేసి పోటీలను నిర్వహించబోతోన్నారు. ఇక వంటలు పోటీలు, ముగ్గుల పోటీలు, సాంప్రదాయ వస్త్రధారణ, జానపద గీతాలు, డ్రాయింగ్, గాలిపటాల తయారీ పోటీలు నిర్వహించబోతోన్నారు.
ఇవన్నీ కాకుండా ఈ సారి కోడి పందెలు మరింత రసవత్తరంగా సాగేట్టు కనిపిస్తోంది. వీటిపై ఏపీ ప్రభుత్వం ఏమైనా ఆంక్షలు విధిస్తుందా? లేదా విచ్చల విడిగా వదిలేస్తుందా? అన్నది చూడాలి. అసలే ఈ కోడి పందెలు చివరకు రాజకీయంగానూ విమర్శలను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి