AP Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మొన్నటివరకూ స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు ఇప్పుడు బలపడటంతో వర్షాలు నమోదవుతున్నాయి. ఇవాళ్టి నుంచి రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఏయే జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఇవాళ ఏపీలోని కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, పల్నాడు, ఎన్టీఆర్, అనకాపల్లి, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
రేపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, సత్యసాయి, కడప, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు. పిడుగులు పడే ప్రమాదమున్నందున రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చెట్ల కింద, టవర్స్ కింద ఉండరాదని సూచిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని హోంమంత్రి అనిత సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న కొద్దిరోజుల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు.
Also read: Ali Resign: రాజకీయాలు నా వల్ల కాదు.. ఇక సినిమాలు చేసుకుంటా: అలీ సంచలన ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook