TDP leader pattabhi gets bail 10 arrested for attacking tdp office : తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు బెయిల్ మంజూరైంది. ఇవ్వాళ బెయిల్ (bail) పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు (High Court) పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది. సెక్షన్ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM YS Jagan Mohan Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారని పట్టాభిని పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. ఆయనకు విజయవాడలో కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్ విధించటంతో మచిలీపట్నం (Machilipatnam) జైలుకు తరలించారు. అక్కడ నుంచి ఆయన్ని శుక్రవారం ఉదయం ప్రత్యేక వాహనంలో పోలీస్ భద్రత మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు (Rajahmundry Central Jail) తీసుకెళ్లారు. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Also Read : Rashmika Mandanna : రష్మిక వర్క్ అవుట్ అదిరిపోయింది.. షాట్ ఓకే అంటూ తరుణ్ కామెంట్
ఇక టీడీపీ పార్టీ కార్యాలయంపై (TDP party office) దాడి కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురిని అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన 10 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. శేషగిరి, పవన్, అడపాల గణపతి, షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్, పానుగంటి చైతన్య, పల్లపు మహేశ్, పేరూరి అజయ్‌లను అరెస్టు చేశారు. మరోవైపు పట్టాభి నివాసంపై దాడి కేసులోనూ 11 మందిని అరెస్టు చేసినట్లు విజయవాడ (Vijayawada) పటమట పోలీసులు వెల్లడించారు.అలాగే సీసీ ఫుటేజీ (CC footage) ఇవ్వాలంటూ టీడీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ (TDP) కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : KTR Sensational Comments: గాంధీభవన్‌లోకి గాడ్సేలు దూరారు: మంత్రి కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook