TDP Twitter: మరోమారు టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్..చంద్రబాబు సీరియస్..!

TDP Twitter: టీడీపీ అధికారిక ట్విట్టర్ మరోమారు హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం స్పష్టం చేసింది.  

Written by - Alla Swamy | Last Updated : Oct 1, 2022, 04:26 PM IST
  • టీడీపీ ట్విట్టర్ మరోమారు హ్యాక్‌
  • టైలర్ హాబ్స్ అనే పేరు ప్రత్యక్షం
  • పునరుద్దరిస్తున్న టీడీపీ సెల్
TDP Twitter: మరోమారు టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్..చంద్రబాబు సీరియస్..!

TDP Twitter: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్‌ అయ్యింది. టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ స్థానంలో టైలర్ హాబ్స్ అనే పేరు ప్రత్యక్షం అవుతోంది. దీంతో హ్యాక్‌కు గురైనట్లు గుర్తించారు. ట్విట్టర్ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్స్ ఆర్ట్స్‌ సంబంధించిన ఫోటోలు కనిపిస్తున్నాయి. ట్విట్టర్ హ్యాండిల్‌లో క్యూక్యూఎల్ క్రియేటర్ అని కనిపిస్తోంది.

వరుసగా ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడంపై ఆ పార్టీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. తొందర్లోనే సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. గతంలోనూ టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. కొన్ని గంటల పాటు శ్రమించడంతో ఖాతా తిరిగి ప్రారంభం అయ్యింది. మళ్లీ అలాంటి సమస్య రావడంపై చంద్రబాబు సైతం సిరీయస్ అయినట్లు తెలుస్తోంది.

Also read:IND vs SA: మరో టీ20 సిరీస్‌పై కన్నేసిన రోహిత్ సేన..రేపే రెండో మ్యాచ్..!  

Also read:GST Collections: దేశంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News