Chandrababu Arrest: నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో బస చేసిన చంద్రబాబుని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏ1గా అరెస్టు చేసినట్టుగా ప్రకటించిన పోలీసులు విచారణ కూడా ప్రారంభించేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో సంచలనం రేపిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. చంద్రబాబుని అరెస్టు చేసేందుకు నిన్న అర్ధరాత్రి దాటాక భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన బస్ వద్దకు పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. డీఐజీ రఘురామరెడ్డి ఆధ్వర్యాన దాదాపు 500 మంది పోలీసులు వచ్చి చేరారు. బస్సు డోర్ నాక్ చేసి చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు డీఐజీ రఘురామరెడ్డి. అప్పటికే అక్కడున్న టీడీపీ నేతల్ని పోలీసులు బలవంతంగా బయటకు పంపించేశారు. అర్ధరాత్రి రావల్సిన అవసరమేంటంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులసు టీడీపీ నేతలకు మధ్య స్వల్పంగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
జెడ్ కేటగరీలో ఉన్న తమ నాయకుడిని అర్ధరాత్రి ఎలా అరెస్టు చేస్తారంటూ టీడీపీ నేతలు అడ్డు తగిలారు. దాంతో పోలీసులు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అడ్డుతొలగకపోతే బస్సు లాక్కుని తీసుకెళ్తామని పోలీసులు హెచ్చరించారు. దాదాపు రెండు గంటల హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో బస్సు నుంచి చంద్రబాబు బయటికొచ్చారు. చంద్రబాబును అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం వైద్యుల్ని రప్పించారు.
మరోవైపు చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి బస్సుల్ని నిలిపివేశారు. బస్సుల నిలిపివేతతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు.
Also read: Chandrababu Naidu: నాసిరకం మద్యం విక్రయిస్తూ.. ప్రజల రక్తం తాగుతున్నాడు: చంద్రబాబు నాయుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook