CM Jagan Tour: వైఎస్ఆర్ కడప జిల్లాలో సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. రేపు, ఎల్లుండి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. రేపు(గురు వారం) ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉదయం 10.50 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌కు వెళ్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు, ప్రజా ప్రతినిధులతో ముచ్చటించి..వారి వినతలు స్వీకరిస్తారు.
ఆ తర్వాత 1.30 గంటలకు పులివెందులలోని ఏపీ కార్ల్ వెళ్తారు. అక్కడ న్యూటెక్ బయోసైన్సెస్‌కు సీఎం జగన్ శంకస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత 3.05 గంటలకు వేంపల్లికి వెళ్తారు. 3.30 గంటలకు డాక్టర్ వైఎస్ఆర్ స్మారక పార్క్‌కు చేరుకుని పార్క్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
అక్కడే విద్యార్థులతో మాట్లాడాతారు. అనంతరం సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్‌కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు సీఎం. ఎల్లుండి(శుక్రవారం) ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఎస్టేట్ నుంచి 8.05 గంటలకు వైఎస్‌ఆర్ ఘాట్‌కు వెళ్తారు. అక్కడే తన తండ్రి దివంగత నేత వైఎస్ఆర్‌కు నివాళులర్పిస్తారు. అక్కడే కాసేపు ప్రార్థనలు చేయనున్నారు సీఎం. అనంతరం 8.55 గంటలకు వైఎస్ఆర్ ఎస్టేట్ నుంచి 10.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగే వైఎస్ఆర్ ప్లీనరీలో పాల్గొంటారు.
Also read:ENG vs IND Playing XI: రోహిత్ ఇన్.. బుమ్రా ఔట్! తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే
Also read:Fraud Case: హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన మరో కంపెనీ..లబోదిబోమంటున్న బాధితులు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook