అమరావతి: తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ (CoronaVirus) కోరలు చాస్తోంది. రోజురోజుకూ కోవిడ్19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో తాజాగా మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఏపీలో కోవిడ్ పాజిటీవ్ కేసల సంఖ్య 23కు చేరుకుంది. ఈ రెండు కేసులు తూర్పుగోదావరి జిల్లాలోనే నమోదు కావడం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా ఎఫెక్ట్: వాట్సాప్ వినియోగదారులకు షాక్
కాకినాడ చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, రాజమండ్రిలో 72 ఏళ్ల వృద్ధుడికి తాజాగా నిర్వహించిన టెస్టులలో కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరిని ఐసోలేషన్ ఉంచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏపీలో అధికంగా విశాఖపట్నంలో 6 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలు నాలుగు చొప్పున ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. తాజా రెండు కేసులతో తూర్పు గోదావరిలో ముగ్గురికి కరోనా సోకినట్లయింది. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
అయితే ఇప్పటివరకూ ఏపీలో ఓ వ్యక్తి కరోనా బారి నుంచి బయటపడ్డాడు. నెల్లూరు వ్యక్తికి తాజా టెస్టుల్లో నెగటీవ్‌గా తేలడంతో డిశ్ఛార్జ్ అయ్యాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. విశాఖ వాసికి సైతం నెగటీవ్‌గా తేలిందని, మరో శాంపిల్ టెస్టులోనూ అదే ఫలితం వస్తే అతడ్ని డిశ్ఛార్జ్ చేసి క్వారంటైన్‌లో ఉంచుతారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ