Pawan Kalyan Entry Girl Missing Case: సినీ పరిశ్రమను వదిలి కొన్నేళ్లుగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ఎప్పటి నుంచో ప్రజలకు సేవ చేయాలని పరితపించిన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తనేంటో నిరూపిస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి నేనేంటో చూపిస్తానని చెప్పిన పవన్ అన్నట్లుగానే తానేంటో చూపిస్తున్నారు. ఓ యువతి అదృశ్యమై 9 నెలలు గడుస్తున్నా ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం అధికారంలోకి కూటమి ప్రభుత్వం రావడంతోపాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు.
Also Read: C Naga Rani IAS: వెస్ట్ గోదావరికి పవర్ ఫుల్ ఆఫీసర్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే అందరికీ హడలే
ఈ క్రమంలోనే ఆ యువతి తల్లి పవన్ కల్యాణ్‌కు తన సమస్యను వెళ్లబోసుకున్నారు. ఆమె పరిస్థితి విన్న పవన్ చలించిపోయి వెంటనే అక్కడికక్కడే ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే చర్యలు తీసుకుని యువతి కేసును చేధించాలని ఆదేశించారు. దీంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఆగమేఘాల మీద విచారణ చేపట్టారు. దీంతో పది రోజుల తర్వాత ఆ యువతి ఆచూకీ కనిపెట్టారు. అచ్చం సినిమాలో జరిగినట్టు పరిణామం ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.
Also Read: NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీలో దొంగతనం.. వృద్ధులకు ఇవ్వాల్సిన రూ.4 లక్షలు చోరీ
అమరావతిలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ జూన్ 22వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఒక్కడే రోడ్డుపై కూర్చుని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ క్రమంలో తమ కుమార్తె కనిపించడం లేదని భీమవరానికి చెందిన శివ కుమారి అనే మహిళ డిప్యూటీ సీఎంకు గోడు వెళ్లబోసుకున్నారు. కన్నీటి పర్యంతమవడంతో వెంటనే పవన్ స్పందించి అక్కడికక్కడే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. నగర పోలీసు కమిషనర్, బృందాలను ఏర్పాటుచేసి యువతి ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలోనే తాజాగా జమ్మూ కశ్మీర్‌లో ఆ యువతి ఆచూకీ లభించింది. విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో ఆమె జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి యువతితోపాటు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
తమ కుమార్తె ఆచూకీ లభించడంతో యువతి తల్లి శివకుమారి ఆనంధానికి అవధులు లేవు. పవన్ కల్యాణ్ చొరవతోనే తన కుమార్తె ఆచూకీ లభించిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 9 నెలలుగా లభ్యం కానీ బిడ్డ ఆచూకీ పవన్‌కి ఫిర్యాదు చేయడంతో 9 రోజుల్లోనే పరిష్కారం లభించడంతో ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో పవన్ సమక్షంలో ఆ యువతిని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి