Visakhapatnam Woman: గంజాయి మత్తులో యువతి అర్ధరాత్రి హల్‌చల్.. బీర్ బాటిల్‌తో ఏఎస్ఐపై దాడి

Visakhapatnam Young Woman Misbehave With Police: ఆమె నడిరోడ్డుపై బీరు తాగుతూ.. గంజాయి సిగరేట్ తాగుతోంది. ఇదేంటని ప్రశ్నించిన ఏఎస్ఐపై బూతు పురాణం అందుకుంది. నోటికి వచ్చినట్లు తిడుతూ.. బీర్ బాటిల్‌లో దాడి చేసింది. కాలితో తన్నేందుకు యత్నించింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 11:40 AM IST
Visakhapatnam Woman: గంజాయి మత్తులో యువతి అర్ధరాత్రి హల్‌చల్.. బీర్ బాటిల్‌తో ఏఎస్ఐపై దాడి

Visakhapatnam Young Woman Misbehave With Police: విశాఖలో అర్ధరాత్రి సమయంలో ఓ యువతి హల్‌చల్ చేసింది. గంజాయి, మద్యం మత్తులో ఉన్న యువతి.. నడిరోడ్డుపై రెచ్చిపోతూ పోలీసులను దుర్భాషలాడింది. వైఎంసీఏ దగ్గర నడిరోడ్డుపై బీరు తాగుతూ గంజాయి సిగరెట్ కాలుస్తుండగా.. ఏఎస్ఐ సత్యనారాయణ ప్రశ్నించారు. దీంతో ఆయనపై తిట్ల దండకం అందుకున్న యువతి బీర్ బాటిల్ తీసుకుని విసిరింది. ఆ బాటిల్ గోవింత్ అనే యువకుడికి తాకడంతో కంటికి గాయమైంది. యువతిపై బాధితుడు మూడో పట్టణం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

యువతితో ఏఎస్‌ఐ మాట్లాడుతున్న సందర్భంలో యువతి బూతులతో రెచ్చిపోయింది. 'ఏరా ఇంతసేపు నన్ను కొట్టింది మార్చిపోయావా..? నా చేతికి గాయమైంది. ఇప్పుడు మంచిగా మాట్లాడిస్తూ వీడియో తీయిస్తావా..?' అంటూ కాలితో తన్నేందుకు యత్నించింది. దీంతో లాఠీ తీసుకుని యువతిపై ఒక దెబ్బ కొట్టాడు ఏఎస్ఐ. స్థానికులు కూడా యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా యువతి ఏ మాత్రం వెనక్కితగ్గకుండా రాయలేని బూతు పదజాలంలో ఏఎస్ఐను తిట్టింది. అనంతరం యువతిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. 

బీర్ కంటి తగిలిన బాధితుడు గోవింద్ మాట్లాడుతూ.. ఏఎస్ఐ కోసం వెళితే ఆమె బీర్‌పై దాడి చేసిందని చెప్పాడు. తన కన్ను సరిగా కనిపించడం లేదని.. ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించాడు. యువతిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఏఎస్ఐ సత్యనారాయణ‌‌ను యువతి అనవసరంగా దుర్భాషలాడిందని స్థానిక యువకులు కూడా తెలిపారు.

స్టేషన్‌లోకి వెళ్లినా యువతి బూతు పురాణం ఆపలేదు. పోలీసులు అయితే నన్నేం చేస్తారంటూ బెదిరించింది. తన ప్రియుడు దుర్గప్రసాద్‌కు చెబితే మీ పని అయిపోతుందంటూ రెచ్చిపోయింది. వీళ్లంతా తన కాలి గోటికి కూడా సరిపోరంటూ స్టేషన్‌లో కూడా రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ యువతికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Also Read: Kane Williamson: కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం.. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై  

Also Read: LIC Policy: కేవలం రూ.70 పెట్టుబడితో రూ.48 లక్షల ఆదాయం.. ఇలా చేయండి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News