MP Vijaysai Reddy Hot Comments: విశాఖ భూములపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రచ్చ రచ్చ సాగుతోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి విశాఖ భూములను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తన కూతురు, అల్లుడి పేర్లతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్‌పీ అనే సంస్థ విశాఖలో గత ఏడాది కాలంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్‌పీ సంస్థలో డైరెక్టర్లుగా విజయసాయి రెడ్డి కూతురు, అల్లుడు ఉన్నారు. దీంతో పాలనా రాజధానిగా విశాఖ ఉంటుందనే నమ్మకంతోనే విశాఖలో భారీగా భూములు కొన్నారనే విమర్శలు వస్తున్నాయి.
తనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, మీడియాలో వస్తున్న కథనాలపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ, రామోజీ రావును టార్గెట్ చేస్తూ సంచలన ప్రకటన చేశారు. టీవీ ఛానల్ ను పెట్టబోతున్నానని ప్రకటించారు సాయిరెడ్డి.విశాఖలో భూములు కొంటున్నారని తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేపర్, టీవీ ఛానెల్ ఉందనే కదా రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారి.. తాను ఇంతవరకు వ్యాపారం చేయలేదు.. ఏ మీడియా రంగంలో అయితే రామూ ఉన్నారో అదే రంగంలోకి తాను ప్రవేశించబోతున్నానని సాయిరెడ్డి అన్నారు. మీ ఛానల్ ఎలా పనిస్తుందో... తాను పెట్టబోయే ఛానల్ ఎలా పని చేస్తుందో చూసుకుందాం రామూ అంటూ సవాల్ విసిరారు.
విశాఖలో తనకు కేవలం ఒక్క ఇల్లు మాత్రమే ఉందన్నారు విజయసాయి రెడ్డి. తన కుమార్తె కుటుంబం నాలుగు దశాబ్దాలుగా వ్యాపారంలో ఉందన్నారు. వ్యాపారం చేస్తున్న వాళ్లు ల్యాండ్స్ కొంటే తనకు ఏం సంబంధమని సాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి భూములు కొంటే.. బాలకృష్ణకు సంబంధం ఉన్నట్లా అని సాయిరెడ్డి నిలదీశారు. రామోజీరావులా తాను మోసం చేసి భూములు తీసుకోలేదన్నారు. రామోజీ ఫిలిం సిటీలోనే 2 వేల 5 వందల ఎకరాల భూమిని కబ్జా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. పక్కవాళ్లు చేస్తే వ్యభిచారం... తాను చేస్తే సంసారం అన్నట్లుగా రామోజీరావు వ్యవహారం ఉందన్నారు సాయి రెడ్డి. భూముల వ్యవహారంలో సీబీఐ విచారణకు తాను సిద్ధమని... రామోజీరావు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. ఎవరు తప్పు చేశారనే విషయాన్ని సీబీఐ తేలుస్తుందని... విచారణ జరిగితే ఎవరు జైలుకు వెళ్తారో తెలుస్తుందని అన్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని రాకూడదన్నదే రామోజీరావు లక్ష్యమన్నారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అర్థం తెలియని సన్నాసులు కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాకుండా అడ్డుకోవడం, అమరావతి భూములతో లక్షల కోట్లు సంపాదించాలనే కుట్రలో భాగంగానే టీడీపీతో కలిసి ఎల్లో మీడియా ఇదంతా చేస్తుందన్నారు. దసపల్లా భూములపై ఇప్పటికే బిల్డర్లు క్లారిటీ ఇచ్చారని చెప్పారు.
Also Read: KTR HOT COMMENTS: బఫూన్ గాళ్లతో వేగలేం.. మునుగోడు బరి నుంచి తప్పుకుంటాం! కేటీఆర్ సంచలన ప్రకటన
Also Read: ఇదేందయ్యో ఇది.. దీన్ని నేనెక్కడా చూడలే! వీడి డాన్స్ చూస్తే షాక్ అవ్వడం పక్కా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook