Record Blood Donation Marks YS Jagans Birthday Fete: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిరోజు సందర్భంగా నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణుల పిలుపు మేరకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో రక్తదాన శిబిరాలలో పాల్గొని జననేత వైఎస్ జగన్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బర్త్‌డేను సందర్భంగా ఏపీ వ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమం ఏకంగా 34,723 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. తద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను బద్దలుకొట్టింది పార్టీ శ్రేణులు చెబుతున్నారు. తాజా ఘనతపై వైఎస్సార్‌సీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ తమ అధికారిక ట్విట్టర్‌లో వివరాలు పోస్ట్ చేసింది.
Also Read: Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు
రక్తదానంలో వైయస్ఆర్ సీపీ వరల్డ్ రికార్డ్
- జననేత పుట్టిన రోజు సందర్భంగా 34,723 యూనిట్ల రక్తదానం
- ప్రపంచంలోనే అతిపెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంపుగా పేర్కొన్న వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులుhttps://t.co/hs6Dxb9UKF— YSR Congress Party (@YSRCParty) December 21, 2020
కాగా, గతంలో రక్తదాన శిబిరంలో 10,500 మేర యూనిట్ల రక్తం దానం చేయగా తాజాగా అంతకు మూడింతల మొత్తంలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ (YSRCP) చేపట్టిన రక్తదాన శిబిరంలో సేకరించారు. ఈ విషయాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషన్ నమోదు చేసుకుంది. త్వరలోనే దీనిపై ఏదైనా అధికారిక వెలువడనుందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook