DA Arrears Latest Update: కరోనా సమయంలో నిలిపివేసిన పెండింగ్ డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ రిలీజ్ చేయడం కుదరని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పడంతో మరింత నిరాశకు గురయ్యారు. 18 నెలల పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు ఇవ్వడం కష్టమేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పెండింగ్ డీఏపై మరో అప్‌డేట్ వచ్చింది.
ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగుల డీఏను నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొంటూ నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ (స్టాఫ్ సైడ్) శివ గోపాల్ మిశ్రా ఈ మేరకు కేబినెట్ సెక్రటరీకి లేఖ రాశారు. పరిస్థితులు మెరుగుపడినప్పుడు ఈ డబ్బు ఉద్యోగుల ఖాతాకు బదిలీ చేస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో వచ్చే ఏడాది బడ్జెట్ తరువాత ప్రభుత్వం ఈ సొమ్మును ఉద్యోగుల ఖాతాలో వేయవచ్చని నిపుణులు అంటున్నారు.
పెండింగ్ డీఏ బకాయిల కోసం ఉద్యోగులు చాలా కాలంగా పోరాడుతున్నారు. దీంతో పాటు ఆర్థిక శాఖ అధికారులు, సంబంధిత శాఖ అధికారుల మధ్య పలుమార్లు చర్చలు జరగగా.. కొత్త ఏడాదిలో ప్రభుత్వం నేరుగా ఈ సొమ్మును ఖాతాలోకి జమ చేస్తుందని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఈ డబ్బును 3 వాయిదాలలో పొందే అవకాశం ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏను ప్రభుత్వం ఇవ్వలేదు.
కేంద్ర ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తే.. వారి ఖాతాలోకి భారీగానే చేరే అవకాశం ఉంది. లెవెల్-3లో ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య ఉండవచ్చని అంచనా. అదేవిధంగా లెవల్-13 లేదా లెవల్-14 ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు ఉండవచ్చు.
Also Read: China Corona Update: కరోనాకే కంగారు పుట్టించేలా.. దంపతుల సూపర్ ఐడియా.. వీడియో వైరల్
Also Read: Venugopal : ఐసీఐసీఐ కేసులో వేణుగోపాల్ ధూత్ అరెస్ట్.. వారు అరెస్టైన మూడు రోజులకే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook