Aadhaar Card Update Latest News: ఆధార్ కార్డు అనేది ఎప్పుడో ఒక కనీస అవసరంగా మారిపోయింది. ఆధార్ కార్డు లేదంటే వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా కనీసం మీ ఫోన్లోకి సిమ్ కార్డు కూడా రాదు. అంతేకాదు.. బ్యాంకుకు వెళ్లి ఖాతా తెరవాలన్నా.. ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఇవేకాకుండా ఇంకెన్నో అంశాల్లో ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఉదాహరణకు మీ వద్ద ప్యాన్ కార్డు ఉండి దానిని వచ్చే మార్చి 31వ తేదీలోగా మీ ఆధార్ కార్డుతో లింక్ చేయనట్టయితే.. ఆ తరువాత ప్యాన్ కార్డు రద్దయిపోతుందని కేంద్రం స్పష్టంచేసిన విషయం తెలిసిందే.
ఆధార్ కార్డు ఎప్పుడు మొదలైందనే విషయానికొస్తే.. 2010 లో సెప్టెంబర్ 29న మొట్టమొదటి ఆధార్ కార్డ్ జారీ అయింది. ఐరిష్ నుంచి మొదలుకుని రెండు చేతుల వేళ్లతో సహా మీ బయోమెట్రిక్స్ తీసుకుని, వాటి ఆధారంగా ఆధార్ కార్డు జారీచేశారు. అంటే మీ పుట్టుపూర్వోత్తరాలు, డేటా అంతా యుఐడేఏఐ వద్ద పదిలంగా ఉందన్నమాట.
తాజాగా ఆధార్ కార్డు గురించి కేంద్రం ఓ ప్రకటన చేసింది. ఒకవేళ మీరు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటి, అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ చేయించనట్టయితే.. వారంతా తమ వివరాలు తిరిగి అప్డేట్ చేయించాలని కేంద్రం స్పష్టంచేసింది. ఇందుకోసం మీ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని సూచించింది. ఈ సర్వీస్ కోసం ఆన్లైన్లో అయితే రూ. 25, ఆఫ్‌లైన్‌లో అయితే రూ. 50 ఖర్చు అవుద్దని యుఐడిఏఐ తేల్చిచెప్పింది. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటి.. అప్పటి నుంచి ఆధార్ కార్డుపై ఎలాంటి అప్డేట్స్ చేయించని వారికే ఇది వర్తిస్తుందని యూఐడిఏఐ పేర్కొంది.
ఇదిలావుంటే, ఆధార్ కార్డుపై మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ లాంటి వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లినట్టయితే.. వాటిని కూడా అప్డేట్ చేసుకునేందుకు యూఐడిఏఐ అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్నిసేవల కోసం మీ సమీపంలోని ఆధార్ సేవ కేంద్రాన్ని విజిట్ చేయాల్సి ఉండగా.. ఇంకొన్ని సేవలను ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా మీరే మీ ఇంటి వద్ద ఉండే వివరాల అప్డేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డు జారీ అయిన తరువాత ప్రస్తుతం మీరు ఉంటున్న చిరునామా మారినట్టయితే.. ఆ వివరాలను సైతం ఆధార్ కార్డుపై అప్డేట్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Jio vs Airtel 5G Plans: రోజూ 3GB డేటా ఇచ్చే ప్లాన్స్.. ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ?
ఇది కూడా చదవండి : Realme Smartphone: రూ. 17 వేల ఫోన్ కేవలం రూ. 1149 కే.. సూపర్ డీల్ కదా..
ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook