అదానీ గ్రూప్ షేర్ల పతనం ఇప్పట్లో ఆగేలా లేదు. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడినప్పటి నుంచే నిరాటంకంగా షేర్ ధర పడిపోతోంది. మరోవైపు నష్టాల్ని నియంత్రించేందుకు, మార్కెట్ స్థిరపర్చేందుకు అదానీ గ్రూప్ దిద్దుబాటు చర్యలకు దిగింది.
అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ధర 4.89 శాతం క్షీణించి..1633.50 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. అంటే ఇంకా ఈ కంపెనీ షేర్ రెడ్ మార్క్‌లోనే ట్రేడింగ్‌లో ఉంది. అదానీ గ్రూప్‌లోని ఇతర కంపెనీల షేర్లు కూడా కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అదానీ పవర్ కంపెనీ షేర్ ఇవాళ 5 శాతం తగ్గడంతో 148.20 రూపాయలకు చేరుకుంది. అటు ఈ షేర్ 52 వారాల కనిష్ట ధర 108.70 రూపాయలుంది. ఇక అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్ కూడా 5 శాతం క్షీణించి..1,071 రూపాయలకు చేరుకుంది.
అదానీ గ్రూప్‌లోని ఇతర కంపెనీ షేర్లలో కూడా పతనం
ఇక అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ మరింతగా పడిపోయి..653.40 రూపాయలకు చేరుకోగా, అదానీ టోటల్ గ్యాస్ షేర్ పతనమై 1135.60 రూపాయలకు చేరుకుంది. అదే విధంగా అదానీ విల్మర్ కంపెనీ షేర్ పడిపోయి 393.60 రూపాయలకు చేరుకుంది. అటు ఎన్డీటీవీ షేర్ 188.35 రూపాయలుంది. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లన్నీ 5 శాతం చొప్పున పడిపోతున్నాయి.
అంబూజా సిమెంట్ షేర్ బీఎస్ఈలో 4.04 శాతం క్షీణించి 328.55 రూపాయలకు చేరుకుంది. ఏసీసీ సిమెంట్ షేర్ 2.01 శాతం పడిపోవడంతో..ఆ కంపెనీ షేర్ ఇప్పుడు 1786.75 రూపాయలుంది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షేర్ 1.17 శాతం పడిపోయి..546.70 రూపాయలకు చేరుకుంది.
అదానీ గ్రూప్ చర్యలు
అదానీ గ్రూప్ కంపెనీ షేర్లలో భారీ పతనంతో కంపెనీ కొన్ని కీలకమైన చర్యలు చేపట్టింది. తమ రెవిన్యూ గ్రోత్ టార్గెట్‌ను తగ్గించేసింది. కంపెనీ టార్గెట్‌ను 40 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also read: Adani-Hindenburg Row: అదానీ దిద్దుబాటు చర్యలు, స్వచ్ఛంధ ఆడిట్ కోసం జీటీ కంపెనీ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook