Akshaya Tritiya 2022: భారతీయులకు బంగారం (Gold) అంటే ఎంతో మక్కువ. ముఖ్యంగా ఆడవారికి ఏ శుభకార్యం జరిగినా మెడలో బంగారం ఉండాల్సిందే. ఇక అక్షయ తృతీయ (Akshaya Tritiya 2022) వచ్చిందంటే చాలు.. గోల్డ్ ను కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే ప్రస్తుత ట్రెండ్ మారిపోయింది. ఇంతకముందులా బంగారాన్ని కొనుగోలు చేయడానికి నగల షాపుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ఆన్లైన్లోనే బంగారం కొనేయవచ్చు. అదే విధంగా అమ్మేయవచ్చు కూడా. ఆన్లైన్లో బంగారం విక్రయిస్తే... ఆ రోజు ఉన్న మార్కెట్ రేటును బట్టి డబ్బు లభిస్తుంది. అందుకే చాలా మంది బంగారం ఆన్లైన్లో కొనేందుకు మెుగ్గుచూపుతున్నారు.
డిజిటల్ గోల్డ్ అంటే?
డిజిటల్ గోల్డ్ (Digital Gold) అనేది 24క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం. మీరు ఆన్లైన్లో బంగారం కొన్న తర్వాత మీరు చెల్లించిన మొత్తానికి సమానమైన గోల్డ్ మీ వాలెట్‌లోకి జమ అవుతుంది. మీరు ఆ బంగారాన్ని విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే... డెలివరీ సదుపాయం కూడా పొందొచ్చు. గోల్డ్ కాయిన్ లేదా బంగారు బిస్కెట్ల రూపంలో మీకు ఆ బంగారం డెలివరీ అవుతుంది. మీరు దాన్ని మీకు నచ్చిన ఆభరణాలుగా మార్చుకోవచ్చు. దీని భద్రత విషయంలో ఎటువంటి భయం అక్కర్లేదు. దీనిని 100 శాతం బీమా చేసి నిల్వ చేస్తారు. ప్రస్తుతం ఆన్లైన్లో Paytm, Google Pay, PhonePe వంటి మొబైల్ ఈ-వాలెట్లతోపాటు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజీ సంస్థలు ద్వారా కూడా గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు.
గూగూప్ పే ద్వారా గోల్డ్ కొనడం ఎలా?
Step 1: గూగూప్ పే యాప్ ను ఓపెన్ చేసి.. new అనే అప్షన్ నొక్కండి
Step 2: సెర్చ్ సెక్షన్ లో 'Gold Locker' ను ఎంటర్ చేయండి.
Step 3: గోల్డ్ లాకర్‌పై క్లిక్ చేసి, Buy అనే అప్షన్ పై క్లిక్ చేయండి. (మీరు బంగారం ప్రస్తుత మార్కెట్ కొనుగోలు ధర (పన్నుతో సహా) చూస్తారు.
Step 4: మీరు ఎంత డబ్బుకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారో అక్కడ ఎంటర్ చేయండి.
Step 5: మీకు ఇష్టమైన చెల్లింపు పద్ధతిని ఎంచుకుని, పేమెంట్ ను పూర్తి చేయండి. కనీసం ఒక గ్రాము బంగారం నుంచి మీరు కొనుగోలు చేయవచ్చు.
Also Read: Amazon Summer Sales: 25 వేల రూపాయలు ఆ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం 7 వేలకే, త్వరపడండి!
గూగూప్ పే ద్వారా గోల్డ్ అమ్మడం ఎలా?
Step 1: గూగూప్ పే యాప్ ను ఓపెన్ చేసి.. new అనే అప్షన్ నొక్కండి
Step 2: సెర్చ్ సెక్షన్ లో 'Gold Locker' ను ఎంటర్ చేయండి.
Step 3: sell అప్షన్ ను ఎంచుకోండి
Step 4: మీరు విక్రయించాలనుకుంటున్న బంగారం బరువును మిల్లీగ్రాములలో నమోదు చేయండి.
Step 5: విక్రయం ఆమోదించబడిన తర్వాత, దానికి తగిననిధులు మీ ఖాతాలో అందుబాటులో ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.