Bank Fraud: దేశంలో మరో భారీ బ్యాంకు మోసం బయటపడింది. గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ అనే సంస్థ ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రూ.22,842 కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్లు తెలిసింది. దేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థల్లో ఇదీ ఒకటి.
ఈ నేపథ్యంలో ఏబీజీ షిప్‌యార్డ్ మాజీ ఛైర్మన్, ఎండీ రిషి కమలేషన్ అగర్వాల్ సహా పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
అగర్వాల్‌తో పాటు.. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానం ముత్తస్వామి, డైరెక్టర్లు అశ్విని కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నివేతియాలపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.
ఉద్దేశపూర్వక నేరం, నమ్మక ద్రోహం సహా వివిధ సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది సీబీఐ. ఈ కేసులో నిందితులులకు చెందిన 13 ప్రాంతాల్లో సోదాలు కూడా నిర్వహించినట్లు వివరించింది.
కేసు ఇలా..
2019 నంబర్ 8న సంస్థపై ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై 2020 మర్చి 12 పూర్తి వివరాలు సమర్పించాలని ఎస్బీఐని కోరింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టులో మరో ఫిర్యాదు చేసింది ఎస్బీఐ.
ఏడాదిన్నరకుపైగా ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత.. ఫిబ్రవరి 7న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
28 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు రుణాలు అందినట్లు ఈ విషయంపై అవగాహనున్న వ్యక్తులు తెలిపారు. ఇందులో ఎస్బీఐ వాటానే అత్యధికంగా రూ.2468.51 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.
బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న నిధులను.. దారిమళ్లించడం, అక్రమంగా వాడుకోవడం వంటివి చేశారని ఎర్నెస్ట్ అండ్ యంగ్ చేసిన ఫోరొన్సిక్ ఆడిట్లో తేలింది.
Also read: Flipkart Lenovo Laptop: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ. 19 వేల కంటే తక్కువ ధరకే ల్యాప్ టాప్!
Also read: Electric scooters: అదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు- బుకింగ్స్ షూరూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook