7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు బంపర్‌ బొనాంజా.. 9 అలవెన్స్‌లు భారీగా పెంపు

9 Allowance Will Be Increase With Dearness Allowance Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ బొనాంజా లభించింది. ఏకంగా 9 అలవెన్స్‌లు పెరుగుతుండడంతో భారీగా ఖాతాల్లో జమ కానుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 26, 2024, 03:55 PM IST
7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు బంపర్‌ బొనాంజా.. 9 అలవెన్స్‌లు భారీగా పెంపు

7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి ప్రతి నెల మార్పులు జరుగుతున్నాయి. మార్చి నెలా చాలా ప్రయోజనాలను కలిగించింది. ఏడో పే కమిషన్‌ చేసిన సవరణలతో డియర్‌నెస్‌ అలవెన్స్‌తోపాటు హెచ్‌ఆర్‌ఏ, ట్రావెల్‌ అలవెన్స్‌లు కూడా భారీగా పెరిగాయి. మొత్తం 9 రకాల అలవెన్స్‌లు ఊహించని స్థాయిలో పెరిగి అది మొత్తం జీతంలో రాబోతున్నది. 

Also Read: Savings Scheme: తక్కువ చెల్లింపుతో దర్జాగా నెలకు రూ.5 వేలు పొందే అద్భుత పథకం

డియర్‌నెస్‌ అలవెన్స్‌ను 4 నుంచి 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఇక హెచ్‌ఆర్‌ఏ 3, 2, 1 శాతం పెంచారు. ఇక ట్రావెల్‌ అలవెన్స్‌ కూడా పెంచారు. ఇవే కాకుండా 9 అలవెన్స్‌లు పెరగనున్నాయి. డియర్‌నెస్‌ అలవెన్స్‌ పెంచుతూనే దాని పరిధి కూడా విస్తరించారు. మిగతా అలవెన్స్‌లకు కూడా డియర్‌నెస్‌ అలవెన్స్‌ మాదిరి పెంచారు. కాగా పెరిగిన అలవెన్స్‌ల ప్రయోజనాలు మార్చి 31వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Also Read: Pink Tax: పురుషుల కంటే మహిళలకే అధిక ధరలు.. అసలు 'పింక్‌ ట్యాక్స్‌' అంటే ఏమిటో తెలుసా?

పెరిగిన అలవెన్స్‌లు ఇవే..
1. ఇంటి అద్దె భత్యం (హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌)
2. పిల్లల విద్యా భత్యం (సీఏఏ)
3. పిల్లల సంరక్షణ ప్రత్యేక భత్యం
4. హాస్టల్‌ సబ్సిడీ
5. బదిలీపై టీఏ
6. గ్రాట్యూటీ పరిమితి
7. దుస్తుల భత్యం
8. సొంత రవాణా కోసం మైలేజ్‌ భత్యం
9. రోజువారీ భత్యం

ఇలా ఈనెలలో ఈ 9 రకాల అలవెన్స్‌లు కూడా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల భారీగా ఉంటుందని.. ఉద్యోగులకు పండగేనని బిజినెస్‌వర్గాలు చెబుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News