Elon Musk House: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్

Elon Musk House: ఖరీదైన టెస్లా కార్ల కంపెనీ ఓనర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గురించి తెలుసు కదా.. ప్రపంచ కుబేరుల్లో ఎలాన్ మస్క్ కూడా ఒకరు. ఈరోజు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అతడి వద్ద ఉన్న ఆస్తి విలువ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23,250 కోట్ల అమెరికన్ డాలర్లు.

Written by - Pavan | Last Updated : Aug 9, 2023, 03:00 PM IST
Elon Musk House: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్

Elon Musk House: ఆజ్ కల్ పేద, ధనికతో సంబంధం లేకుండా ఎవరికి ఉన్నంతలో వాళ్లు డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో ఉండటం చాలా కామన్ అయింది. అది సొంతిల్లు అయినా.. లేక కిరాయి ఇల్లు అయినా డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అయితేనే ఎంతో కొంత సౌకర్యంగా ఉంటుందనే భావన చాలామందిలో ఉంటుంది. అందుకే ఒకవేళ ఇల్లు అద్దెకు తీసుకునే సందర్భాల్లో కూడా కొంత ఖర్చు ఎక్కువైనప్పటికీ.. ఆ ఖర్చుకు వెనుకాడకుండా కనీసం డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అయితేనే బాగుంటుంది అని వెదుకుతుంటారు. అంతెందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇల్లు లేని పేదలకు కట్టిస్తానని హామీ ఇచ్చింది కూడా ఈ డబల్ బెడ్ రూన్ ఇండ్లే కదా.. అయినా ఇప్పుడు ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల గొడవ ఎందుకు అంటారా ? అక్కడికే వస్తున్నాం. 

ఖరీదైన టెస్లా కార్ల కంపెనీ ఓనర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గురించి తెలుసు కదా.. ప్రపంచ కుబేరుల్లో ఎలాన్ మస్క్ కూడా ఒకరు. ఈరోజు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అతడి వద్ద ఉన్న ఆస్తి విలువ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23,250 కోట్ల అమెరికన్ డాలర్లు. మరి అంత పెద్ద కుబేరుడు కదా.. అతడు ఉండే ఇల్లు ఎకరాలకు ఎకరాలు ఉండే ఎస్టేట్‌లో రాజభవంతి లాంటి ప్యాలెస్ అయ్యుంటుంది అనే కదా ఎవరైనా అనుకునేది !? కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అతడు ఉండేది కూడా మనలో చాలామందిలా డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లోనేనట. 

ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. ఫేమస్ బయోగ్రాఫర్ వాల్టర్ ఐజాక్ సన్. ఎంతోమంది ప్రముఖుల బయోగ్రఫీలు రాసిన వాల్టర్ ఐజాక్ సన్ ... ఎలాన్ మస్క్ బయోగ్రఫీ కూడా రాశాడు. 'ఎలాన్ మస్క్' పేరిటే 2023 సెప్టెంబర్ 12న ఈ పుస్తకం విడుదల కానుంది. అంతకంటే ముందే ఈ పుస్తకాన్ని చేతపట్టుకోవాలని అనుకునే వాళ్లు అమెజాన్ లో ప్రీఆర్డర్ చేయొచ్చు అని చెప్పుకొచ్చిన వాల్టర్.. తాను ఎలాన్ మస్క్ బయోగ్రఫీ కోసం చర్చించడానికి వెళ్లినప్పుడు అతడిని ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లోనే కలిశాను అని అన్నాడు. టెక్సాస్‌లోని బోకో చికాలో ఎలోన్ మస్క్ ట్వూ బెడ్ రూమ్ ఫ్లాట్‌లోనే చాలాసేపు బయోగ్రఫీ గురించి చర్చించాం అని చెప్పిన వాల్టర్.. అందుకు సంబంధించిన ఒక ఇమేజ్ కూడా షేర్ చేసుకున్నాడు. 

ఇది కూడా చదవండి : Credit Cards Usage: క్రెడిట్ కార్డులతో కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

2020 లో ఎలాన్ మస్క్ తనకి ఉన్న 5 ఖరీదైన బంగ్లాలు అమ్మేయాలని నిర్ణయించుకున్నాడని.. అప్పటి నుంచి ఈ రెండు బెడ్ రూమ్స్ ఇంటినే తన నివాసంగా మల్చుకున్నాడని వాల్టర్ స్పష్టంచేశాడు. వాల్టర్ వెల్లడించిన ఈ విషయం విని యావత్ ప్రపంచం షాక్ అవుతోంది. కొంచెం డబ్బులు ఉంటేనే డూప్లెక్స్, త్రిప్లెక్స్ బంగ్లాలు అని లగ్జరీ లైఫ్ వెంట పరుగెత్తే జనం ఉన్న ఈ రోజుల్లో ఇంత పెద్ద కుబేరుడు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో ఎలా సర్దుకుపోతున్నాడు ? ఎందుకు సర్దుకుపోతున్నాడు అని జనం ఆశ్చర్యపోతున్నారు.

ఇది కూడా చదవండి : Top Most Selling SUV cars in India : ఇండియాలో అత్యధికంగా సేల్ అయ్యే టాప్ 10 SUV కార్ల జాబితా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News