FD Rate Hike: దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటి అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంపిక చేసిన కొన్ని టెన్యూర్స్ పై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద స్పెషల్ టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా బ్యాంక్ విడుదల చేసింది. 2024 అక్టోబర్ 21 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంకు స్పష్టం చేసింది. వడ్డీ రేట్లు సవరించిన తర్వాత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో ఇప్పుడు వడ్డీ రేట్లు కాలెబుల్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7 రోజుల నుంచి 10ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై కనీసం 4శాతం నుంచి గరిష్టంగా 7.45 శాతం వరకు ఉన్నాయి. నాన్ కాలెబుల్ డిపాజిట్లపై 555 రోజుల టెన్యూర్ పై అత్యధికంగా వీరికి 7.50 శాతం వడ్డీ అందిస్తుంది.
కాలెబుల్ అంటే మెచ్యూరిటీకి ముందు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండే డిపాజిట్లు కాలెబుల్ అంటారు. ఇదేవిధంగా నాన్ కాలెబుల్ ఎఫ్డీ అంటే మెచ్యూరిటీకి ముందు నగదు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్స్ వరకు వడ్డీ ఎక్కువగా వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. రూ. 3కోట్ల కంటే తక్కువ చేసే రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వర్తిస్తుంది. వీరికి కాలెబుల్ డిపాజిట్లపై కనీసం 4 శాతం నుంచి గరిష్టంగా 7.95శాతం వరకు వడ్డీ అందుతుంది. ఇక్కడ సీనియర్ సిటిజెన్లకు నాన్ కాలెబుల్ డిపాజిట్ అయిన 555 రోజుల వ్యవధిపై అధికంగా 8శాతం అందిస్తోంది.
Also Read: US: Business Ideas: తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ తెలియని, 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే..నెలకు రూ. 1 లక్ష పక్కా
సూపర్ సీనియర్ సిటిజెన్లకు బ్యాంక్ కాస్త ఎక్కువ వడ్డీనే అందిస్తోంది. ఇక్కడ సీనియర్ సిటిజన్లు కంటే మరో 0.15శాతం వడ్డీ అధికంగా వస్తుందని చెప్పవచ్చు. 222 రోజులు, 333 రోజులు, 444 రోజులు, 555రోజులు, 777రోజులు, 999 రోజులు ఈ విధంగా స్పెషల్ డిపాజిట్లపై వడ్డీ వీరికి ఎక్కువగా ఉంటుంది. 555 రోజుల నాన్ కాలెబుల్ డిపాజిట్ పై వీరికి 8.15శాతం వడ్డీ రేటు ఉంటుంది. కాలెబుల్ డిపాజిట్లపై 8.10 శాతం వడ్డీ అందిస్తుంది. స్పెషల్ టెన్యూర్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేందుకు 2024, డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంది.
555 రోజుల డిపాజిట్ పై రూ. 5లక్షలు డిపాజిట్ చేస్తే ఎవరికి ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం. సాధారణ ప్రజలకు 7.50శాతం లెక్కన చూసినట్లయితే రూ. 57,209 వడ్డీ అందుతుంది. సీనియర్ సిటిజన్లకు ఇక్కడ 8శాతం లెక్కన 5లక్షలు జమ చేసినట్లయితే మెచ్యురిటీకి చేతికి రూ. 61,020 వడ్డీ అందుతుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.15 లెక్కన రూ. 62,166 వడ్డీ అందుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.