Gold Price Today: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. పసిడి ప్రియులు చాలా ఆనందపడ్డారు. అయితే ఆ తరువాత క్రమంగా పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం నిన్నటి ధరే ఇప్పటికీ కొనసాగుతోంది. ఇవాళ సోమవారం బంగారం ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 7953.3 రూపాయలుంటే 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 7292.3 రూపాయలుంది.
గత వారం రోజులుగా 24 క్యారెట్ల బంగారం ధరలో 1.11 శాతం మార్పు కన్పించగా గత నెలలో 2.12 శాతం తగ్గింది. ఇక సిల్వర్ ధర కిలో 97,100 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం దర 10 గ్రాములు 79 వేల 533 రూపాయలుగా ఉంది. నిన్నటి నుంచి ఇదే ధర కొనసాగుతోంది. ఇక సిల్వర్ ధర కిలో 97 వేల 100 రూపాయలుగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 79, 381 రూపాయలు కాగా సిల్వర్ ధర 1 లక్షా 5 వేల 7 వందల రూపాయలుగా ఉంది.
ఇక ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధఘర 79,387 రూపాయలుండగా సిల్వర్ ధర 96 వేల 4 వందల రూపాయలుంది. ఇక కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 79,385 రూపాయలు కాగా, సిల్వర్ ధర 97 వేల 900 రూపాయలుంది. నిన్న కూడా ఇదే ధర కొనసాగింది. బంగారం, సిల్వర్ ధరలు పెరగడం లేదా తగ్గడం అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. యూఎస్ డాలర్ విలువ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం, మార్కెట్ స్థితిగతులు ప్రభావం చూపిస్తుంటాయి.
Also read: AP Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు రేపట్నించి ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.