iPhones price drop: ఐఫోన్.. చాలా మంది యూత్‌కు ఇదో లగ్జరీ ఐటం. ఖరీదు ఎక్కువ కాబట్టి ఎంతో ఇష్టమున్నా దానిని కొనుగోలు చేయరు. కొంతమందేమో.. ఐఫోన్ కోసమే ప్రత్యేకంగా సేవింగ్స్ చేస్తుంటారు. అయితే అలా ఐఫోన్ కొనాలనే కొరిక ఉన్నా.. రేటు కారణంగా వెనక్కి తగ్గే వాళ్లకు గుడ్ న్యూస్. రూ.15లకన్నా తక్కువ ధరకు ఐఫోన్ కొనుగోలు చేసే అవకాశం రానుంది.
అంత తక్కువ ధరకు ఎందుకు?
యాపిల్ ఇప్పటికే బడ్జెట్ సెగ్మెంట్లో ఫోన్లను విడుదల చేస్తోంది. ఎస్ఈ, ఎస్ఈ2 వంటి మోడళ్లు ఈ కోవలోకే వస్తాయి. ఇప్పడు తాజాగా ఎస్ 3 (2022)ను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది యాపిల్. మార్చి 8న ఈ ఐఫోన్ ఎస్ఈ3ని విడుదల చేయొచ్చని అంచనాలు ఉన్నాయి.
అయితే ఎస్ఈ సెగ్మెంట్లో అప్డేట్ వెర్షన్‌గా ఈ ఎస్ఈ3 అందుబాటులోకి రానుంది. దీనితో ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎస్ఈ, ఎస్ఈ2ల ధరలు భారీగా తగ్గొచ్చని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ఈ 2022 మోడల్‌ను రూ.15 అంతక్నా తక్కువ ధరకే విక్రయించొచ్చని సమాచారం.
బ్రాండ్ న్యూ ఐఫోన్ రూ.15 వేలకు లభించడం అంటే.. ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.
బడ్జెట్ మోడల్ ఐఫోన్ ఎస్ఈ 2 (2020)ని గత ఏడాది రూ.42,500లకు మార్కెట్లోకి విడుదల చేసింది యాపిల్. ఇప్పటికే ఈ ఫోన్ ధర ఫ్లిప్కారక్ట్లో దాదాపు రూ.27 వేలకు లభిస్తోంది. ఐఫోన్ 2022 మార్కెట్లోకి వస్తే.. దీని ధర రూ.15 వేలకు దిగిరావచ్చని అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ 2022 ధరను రూ..22,517గా ఉంచొచ్చని కూడా తెలుస్తోంది.
అయితే ఐఫోన్ ఎస్ఈ 2022 విడుదల తేదీ గురించి గానీ, పాత మోడళ్ల ధరల తగ్గింపు గురించి గానీ అధికారిక ప్రకటన చేయలేదు యాపిల్.
ఐఫోన్ 2022 గురించి..
- 5జీ వేరియంట్
- 4.7 అంగుళాల డిస్ప్లే
- 64 జీబీ స్టోరేజ్
- 12 మెగా పిక్సెల్‌తో రియర్, సెల్ఫీ కెమెరాలు
- యాపిల్ ఏ 15 బయోనిక్ చిప్సెట్
Also read: Flipkart Symphony Cooler: ఏసీలా గోడకు ఫిట్ చేసుకునే కూలర్.. కేవలం రూ.12,824 మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook