Kia Carens: కియా క్యారెన్స్ దూకుడు మామాలుగా లేదుగా, ఎర్టిగాను దాటేసిన అమ్మకాలు

Kia Carens: దేశంలో మారుతి సుజుకి కార్లకు ఉన్న క్రేజ్, డిమాండ్ ఇతర కార్లకు ఉండవు. మారుతి సుజుకి కంపెనీ కార్లంటే అంత నమ్మకం. 7 సీటర్ కావచ్చు, హ్యాచ్‌బ్యాక్ సెడాన్ కావచ్చు, ఎస్‌యూవీ కావచ్చు. మారుతి కంపెనీ అయితే చాలన్నట్టు ఉంటుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 9, 2023, 04:14 PM IST
Kia Carens: కియా క్యారెన్స్ దూకుడు మామాలుగా లేదుగా, ఎర్టిగాను దాటేసిన అమ్మకాలు

Kia Carens: అయితే ఇప్పుడు మారుతి సుజుకిని కాదని ఆ కారుపై మోజు పెరిగిపోతోంది. 7 సీటర్ ఎంపీవీ కార్లలో టాప్ సెల్లర్‌గా ఉన్న మారుతి ఎర్టిగాను కాదని కియా మోటార్స్ కారు దూసుకెళ్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మారుతి సుజుకి ఎర్టిగా..దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న 7 సీటర్ ఎంపీవీ కారు. కానీ ఇప్పుడు కియో మోటార్స్ క్యారెన్స్ పోటీ పడుతోంది. మారుతి ఎర్టిగా అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. కియా మోటార్స్‌కు చెందిన క్యారెన్స్ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. వాస్తవానికి 7 సీటర్ ఎంపీవీ విభాగంలో తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి ఎర్టిగా అంటే అందరికీ క్రేజ్ ఎక్కువ. కానీ కియా క్యారెన్స్ ఇప్పుడు మారుతి ఎర్టిగాను ఢీ కొడుతోంది. కియా క్యారెన్స్ ఇండియాలో అప్పుడే 1 లక్ష కంటే ఎక్కువ కార్లను విక్రయించేసింది. అది కూడా కేవలం 16 నెలల్లో కియా క్యారెన్స్ లక్షకు పైగా యూనిట్లు విక్రయమయ్యాయి. కియా సెల్టోస్ తరువాత సక్సెస్ అయిన మోడల్ ఇదే. 2022 ఫిబ్రవరిలో కియా క్యారెన్స్ లాంచ్ అయింది. 2023 జనవరి నుంచి మే మధ్యలో 32, 724 కియా క్యారెన్స్ విక్రయాలు నమోదు చేసింది. ప్రతి నెలా దాదాపుగా 6,544 యూనిట్ల క్యారెన్స్ కార్లు అమ్ముడౌతున్నాయి.

ఇండియాలో ఈ ఎంపీవీ సక్సెస్ గత ఏడాది జనవరిలో బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిరోజులకే లభించింది. మొదటి 24 గంటల్లోనే ఈ కారు 7,738 యూనిట్లు బుక్ అయ్యాయి. మార్చ్ 10 వరకూ 50 వేల బుకింగ్స్ పూర్తయ్యాయి.

క్యారెన్స్ ఇంజన్ ఆప్షన్స్ 1.5 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మూడు వేరియంట్లలో ఉంది. పెట్రోల్ వెర్షన్ మైలేజ్ 16.5 కిలోమీటర్లు కాగా డీజిల్ వెర్షన్ మైలేజ్ 21.5 లీటర్లు వరకూ ఉంటుందని కంపెనీ చెబుతోంది. కియా క్యారెన్స్ అడ్వాన్స్డ్ పీచర్లు, స్టైల్‌తో లాంచ్ అయింది. ఇందులో 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్లు ఉన్నాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో కియా క్యారెన్స్‌కు 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇందులో స్టాండర్డ్ ఫీచర్‌గా 6 ఎయిర్ బ్యాగ్స్ అందిస్తోంది కంపెనీ. ఇక ధర విషయాన్ని పరిశీలిస్తే కియా క్యారెన్స్ 21 వేరియంట్లలో లభ్యమౌతుంది. ఈ కారు ధర 8,99000 నుంచి ప్రారంభమై 16.99 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో ఎక్కువ స్పేస్, కంఫర్ట్‌తో పాటు ప్రీమియం, పెద్ద క్యాబిన్ లభిస్తాయి.

కియా క్యారెన్స్‌లో 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 64 కలర్ ఏంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫయర్, 2,3 వరుసలకు ఏసీ వెంట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.

Also read: Post office Schemes: పోస్టాఫీసుల్లో ఎవర్ గ్రీన్ డిపాజిట్ పథకాలివే, ప్రయోజనాలివీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News