Maruti Suzuki Swift First Look Leaked 2024: అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మారుతీ షిఫ్ట్ ఒకటి.. ఇది ఒక చిన్న ఫ్యామిలీకి ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటుంది. అంతేకాకుండా కాస్ట్ పరంగా కూడా చాలా రీజనబుల్‌గా ఉంటుంది. ఇక ఈ కారుకు సంబంధించిన విక్రయాల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దీనిని ఎక్కువగా హై ఎండ్ కస్టమర్స్ కంటే.. మిడిల్ క్లాస్ వినియోగదారులే ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. మారుతి సుజుకి కంపెనీ ఈ కారును విడుదల చేసి కొన్నేళ్లయినప్పటికీ మార్కెట్లో ఇప్పటికీ రికార్డులు బద్దలు కొడుతూ విక్రయాల్లో దూసుకుపోతోంది. దీనికి తోడు అమ్మకాల్లో డిజైర్ కూడా అంతే యాక్టివ్ గా ఉంది. ప్రతి సంవత్సరం కంపెనీ కొత్త కొత్త డిజైన్లతో ఈ కార్లను విడుదల చేస్తూనే వస్తోంది.
గత సంవత్సరం కొత్త డిజైన్‌తో లాంచ్ చేసిన మారుతి స్విఫ్ట్‌కి మార్కెట్లో మంచి స్పందన లభించింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని మారుతి సుజుకి కంపెనీ మరోసారి 2024 సంవత్సరంలో కొత్త డిజైన్‌తో స్విఫ్ట్ కారుని విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టెస్టింగ్‌లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ టెస్టింగ్ సమయాల్లో మారుతి షిఫ్ట్(Maruti Suzuki Swift 2024) చాలా సార్లు రోడ్లపై కొత్త డిజైన్‌తో కనిపించింది. అయితే ఈ కారు ఇంతకుముందున్న డిజైన్ కంటే సరికొత్త రూపుతో మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక డిజైర్ విషయానికొస్తే ఈ కారు కూడా చాలా ఆకర్షణీయమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే ఈ రెండు కార్లు ఏయే ఫీచర్లతో అందుబాటులోకి వస్తాయో ఈ రెండింటిలో జరిగే మార్పులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్స్టీరియల్ డిజైనింగ్ వివరాలు:
2024 సంవత్సరంలో మార్కెట్లోకి విడుదల కాబోయే మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త రూపుతో కనిపించబోతోంది. దీని ఎక్స్టీరియల్ విషయానికొస్తే ఆకర్షణీయమైన బంపర్‌తో పాటు సరికొత్త ఎల్ఈడీ లైట్లు అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు కొత్త అల్లాయ్ వీల్స్, వెనక డోర్ హ్యాండిల్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు మారుతి డిజైర్ ఇంతకు ముందున్న లుక్కుతో కాకుండా కొత్త డిజైన్లు కనిపించబోతోంది. ఇక ఈ డిజైన్‌కు సంబంధించిన డిజైన్ను కంపెనీ ఇంకా ఆవిష్కరించలేనట్లు సమాచారం. కానీ ఇటీవలే ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్ వివరాలు లీక్ అయ్యాయి. లీకైన వివరాల ప్రకారం డిజైన్ లోపలి భాగంలో కొత్త కలర్స్లో ఫర్నిచర్‌తో తయారు చేసే అవకాశాలు ఉన్నాయి.
మారుతి స్విఫ్ట్(Maruti Suzuki Swift) లోపలి భాగం వివరాల్లోకి వెళితే, ఇది టోటల్‌గా ఆఫ్-వైట్ థీమ్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బ్యాడ్జ్‌లు కూడా బ్లాక్-థీమ్‌లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటి డ్యాష్ బోర్డ్ సరికొత్తగా కనిపించబోతోంది. అంతేకాకుండా వీటిల్లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం దీంతో పాటు అనేక ఫీచర్స్ కూడా అందుబాటులో రాబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Maruti Suzuki Swift 2024: మారుతి స్విఫ్ట్ కారు డిజైన్ పూర్తిగా చేంజ్..త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త లుక్‌తో..డిజైన్ లీక్!