SpiceJet Special Sale: అయోధ్యకు స్పైస్‌జెట్ ప్రత్యేక ఫ్లైట్, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఏదైనా 1622 రూపాయలే

SpiceJet Special Sale: అయోధ్యలో రామమందిరం ప్రారంభమైపోయింది జనవరి 22న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ తరువాత దేశమంతా అయోధ్యకు దారి తీస్తోంది. రోజురోజుకూ భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు. ఈ నేపధ్యంలో స్పైస్‌జెట్ నుంచి ఊహించని ఆఫర్ వెలువడింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 25, 2024, 04:16 PM IST
SpiceJet Special Sale: అయోధ్యకు స్పైస్‌జెట్ ప్రత్యేక ఫ్లైట్, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఏదైనా 1622 రూపాయలే

SpiceJet Special Sale: అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్టకు గౌరవసూచకంగా స్పైస్‌జెట్ భక్తుల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించిది. విమాన ధరలపై ప్రత్యేక ఆఫర్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్ ప్రకారం దేశీయంగా, అంతర్జాతీయంగా అయోధ్యకు కేవలం 1622 రూపాయలకే విమానంలో వెళ్లవచ్చు. ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

స్పెస్‌జెట్ స్పెషల్ ఆఫర్ వివరాలు

స్పైస్‌జెట్ ప్రకటించిన అయోధ్య ప్రత్యేక ఆఫర్ ప్రకారం బుకింగ్ పీరియడ్ జనవరి 22 నుంచి జనవరి 28 మధ్యలో ఉండాలి. అంటే మరో మూడ్రోజుల్లో ఆఫర్ ముగియనుంది. ఇక ప్రయాణం మాత్రం జనవరి 22 నుంచి సెప్టెంబర్ 39 వరకూ అవకాశముంటుంది. 

నిబంధనలు ఇలా

1. ఈ ఆఫర్ అనేది కేవలం ఒకవైపు ప్రయాణించే దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తుంది.
2. పరిమిత సీట్లు ఉండటంతో ఎవరు ముందు వస్తే వారికే ప్రాధాన్యత
3. ఈ ఆఫర్ ధర కేవలం ఎకానమీ తరగతికి మాత్రమే, మిగిలిన వాటికి కాదు
4. గ్రూప్ బుకింగ్స్‌కు వర్తించదు
5. ఇతర ఆఫర్‌తో ఈ ఆఫర్ క్లబ్ చేయడం జరగదు
6. స్పైస్‌జెట్ వెబ్‌సైట్, ఎం సైట్, మొబైల్ యాప్స్ ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు.

అయోధ్యకు కొత్తగా డైరెక్ట్ ఫ్లైట్స్

విస్తరణలో భాగంగా స్పైస్‌జెట్ అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్ ప్రకటించింది. ఈ డైరెక్ట్ ఫ్లైట్స్ ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, పాట్నా, దర్బంగాల నుంచి ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులో ఉంటాయి. ఎయిర్ కనెక్టివిటీ పెంచడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ది సాధ్యమౌతుందని స్పైస్‌జెట్ ఆలోచనగా ఉంది. అయోధ్య నుంచి చెన్నై, బెంగళరు, ముంబైకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి.

Also read: Check your Vote: మీ ఓటు ఉందో లేదో చూసుకున్నారా, ఎలా చెక్ చేసుకోవాలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News