AC Big Discount: వేసవి కాలం సమీపిస్తుండటంతో మరోసారి చల్లదనం ఇచ్చే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల విక్రయాలు పెరుగుతున్నాయి. వేసవి రాకముందే ఇప్పుడే చల్లదనాన్ని ఇచ్చే వస్తువులు కొనుగోలు చేస్తే మనకు కొంత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలోనే ఆ వస్తువులను కొని పెట్టుకుంటే వేసవికి హాయిగా స్వాగతం పలకవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీలు ఆఫర్లు ప్రకటించేశాయి. వేసవిలో ఏసీల వినియోగం అధికంగా ఉంటుండడంతో ఏసీల కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటించాయి. అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఏసీ ధరలు ఇలా ఉన్నాయి.
Also Read: Gold Price Today: పసిడి ధరలకు బ్రేక్, స్వల్పంగా తగ్గిన ధరలు, ఇవాళ్టి ధర ఎంత
ఇలా వివిధ రకాల కంపెనీలపై భారీ డిస్కౌంట్ సేల్ జరుగుతోంది. ఫిబ్రవరి ప్రారంభం కాగానే ఏసీలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపు ఆఫర్‌తో సేల్ జరుగుతోంది. ఎండాకాలంలో ఫ్యాన్, ఏసీలు నిరంతరం ఆన్‌లో ఉంటాయి. ఈ వేసవి నేపథ్యంలో మీరు ఏసీ కొనాలని చూస్తున్నారా? మీరు కూడా ఏసీ కొనాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఆన్ లైన్ సైట్ లలో తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీని ద్వారా మీరు భారీ తగ్గింపుతో ఏసీని కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం ఆన్ లైన్ షాపింగ్ సైట్ లలో డైక్లీన్ (Daiclean AC)పై భారీ తగ్గింపు ధర కొనసాగుతోంది. మార్కెట్ లో ఆ ఏసీ వాస్తవంగా రూ.67,200 ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపులో ఈ ఏసీ లభిస్తోంది. 32 శాతం తగ్గింపుతో ఈ ఏసీ రూ.45,000 వద్దకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.5,000 తగ్గింపు లభిస్తోంది. ఇలా మరికొన్ని ఆఫర్లతో ఏసీని రూ.50,000 తక్కువకే కొనుగోలు చేయవచ్చు. వివిధ కంపెనీలలో భారీ తగ్గింపు విక్రయాలు జరుగుతున్న వేళ మీరు ఏసీ కొనడానికి ఇదే సరైన సమయం. పూర్తి వేసవి ప్రారంభమైతే ఏసీ ధర పెరిగే అవకాశం ఉంది. ఇలా ప్రస్తుతం కొనసాగుతున్న సేల్‌లో ఎల్‌జీ, వోల్టాస్ వంటి దిగ్గజ కంపెనీల ఏసీలను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి