Customs duty on auto parts raised: వాహనదారులకు, ఆటో ఇండస్ట్రీకి నేడు కేంద్రం ప్రవేశపెట్టిన Budget 2021 షాక్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2021 వార్షిక బడ్జెట్‌లో కొన్ని రకాల ఆటోమొబైల్ పార్ట్స్‌పై కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి పెంచనున్నట్టు తెలిపారు. దీంతో కొన్ని రకాల వాహనాలతో పాటు వాటికి సంబంధించిన కొన్ని విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి.
ఇప్పటికే కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి అనంతరం అమ్మకాలు పడిపోయాయని ఆటో ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తంచేస్తోంది. దీనికితోడు తాజాగా కొన్ని ఆటో పార్ట్స్‌పై Customs duty కూడా పెంచడం అనేది అటు ఆటో ఇండస్ట్రీకైనా ( Auto industry ).. ఇటు వాహనదారులకైనా ఇబ్బందికరమైన పరిణామమే అవుతుందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.
Also read : Budget Expectations 2021: బడ్దెట్‌లో దేనికి ప్రాధాన్యత..నిర్మలా సీతారామన్ ఏమన్నారు
ఆటోమొబైల్ పార్ట్స్‌పై ఇలా Customs duty పెంచడం వరుసగా ఇది మూడోసారి. గతేడాది కూడా పలు Automobile parts తో పాటు Imported vehicles పై కూడా కస్టమ్స్ డ్యూటీ పెంచిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook