DA Arrears: 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రతి యేటా రెండు సార్లు జనవరి, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు ఉంటుంది. అయితే కరోనా సమయంలో ఏడాదిన్నరపాటు డీఏ పెంపు నిలిచిపోయింది. అంటే మొత్తం 18 నెలల డీఏ అందలేదు. ఈ డీఏ చెల్లించాలని ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ, డీఆర్ రెండింటినీ నిలిపివేసింది. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకూ అంటే 18 నెలలపాటు డీఏ, డీఆర్ రెండూ ఆగిపోయాయి. తరువాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఆగిపోయిన 18 నెలల డీఏ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా కోరుతున్నారు. గత రెండు బడ్జెట్లలోనూ కేంద్ర ప్రభుత్వ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసారి అంటే రేపు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో డీఏ బకాయిలపై కీలక ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆర్ధిక శాక మంత్రి నిర్మలా సీతారామన్ డీఏ బకాయిలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని సమాచారం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ కార్యదర్శి శివ గుప్తా 18 నెలల బకాయిలు విడుదల చేయలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంతకుముందు భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ కార్యదర్శి ముకేశ్ సింగ్ కూడా 18 నెలల డీఎ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 18 నెలలపాటు డీఏ నిలిపివేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడినందున ఆ డీఏ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. అటు ప్రధాని నరేంద్ర మోదీకు కూడా లేఖ రాశారు. డీఏ బకాయిల విడుదలకు ప్రభుత్వ అంగీకరిస్తే ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది.
18 నెలల డీఏ బకాయిల విడుదలపై రేపటి కేంద్ర బడ్జెట్ లో కీలక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు దశ తిరిగినట్టే. ఒకేసారి 18 నెలల డీఏ బకాయిలంటే ప్రతి ఉద్యోగి కనీసం 1 లక్ష రూపాయలకు తగ్గకుండా తీసుకునే అవకాశముంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook