/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం నిరంతరం ఏదో ఒక కొత్ ఫీచర్ తీసుకొస్తుంది. గత కొన్ని నెలలుగా ప్రైవసీ పాలసీ వివాదంతో కొందరు వాట్సాప్ డిలీట్ చేయడం, అన్‌ఇన్‌స్టాల్ చేయడం చేస్తున్నారు. ఈ క్రమంలో మరో కొత్త ఫీచర్‌ (WhatsApps Fast Playback Feature)ను వినియోగదారులకు అందించే దిశగా వాట్సాప్ అడుగులు పడుతున్నాయి.

మనం అప్పుడప్పుడూ ఇతరులకు ఫొటో, వీడియో సందేశాలకు బదులుగా వాయిస్ మెస్సేజ్‌లు చేస్తుంటాం. అయితే వాయిస్ మెస్సేజ్‌లు వేగవంతంగా వినడం పూర్తి చేయడానికి సరికొత్త ఫీచర్ వాట్సాప్ (WhatsApp) ఫాస్ట్ ప్లే‌బ్యాక్ ఫీచర్ లాంచ్ చేస్తోంది. వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌ వాయిస్ మెస్సేజ్‌లను ఎంకరేజ్ చేయడానికి ఫాస్ట్ ప్లే‌బ్యాక్ ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు వాట్సాప్ ఈ సౌకర్యాన్ని తీసుకురానుంది. టెక్ట్స్ మెస్సేజ్‌లతో అధిక సమయం అవుతుందని, వాయిస్ మెస్సేజ్‌లు తీసుకొచ్చింది. దీని ద్వారా త్వరగా అవతలి వ్యక్తి చెప్పే విషయాలు తెలుసుకుని బదులివ్వడం చేస్తుంటారు.

Also Read: WhatsApp Stickers: వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్, టైప్ చేస్తే చాలు కావాల్సిన స్టిక్కర్స్

వాట్సాప్ ఫాస్ట్ ప్లే‌బ్యాక్ ఫీచర్- WhatsApps Fast Playback Feature
వాట్సాప్ ఫాస్ట్ ప్లే‌బ్యాక్ ఫీచర్ ఉపయోగిస్తే వాయిస్ మెస్సేజ్ ప్లే‌బ్యాక్ వేగం 1.5 రెట్లు లేదా 2 రెట్లకు పెరుగుతుంది. అయితే ఫాస్ట్ ప్లే‌బ్యాక్ ఫీచర్ వాడకం ద్వారా తక్కువ సమయంలోనే వాయిస్ మెస్సేజ్‌లు విని మీ మిత్రులు, బంధువులు, సహోద్యోగులకు అంతే వేగంగా బదులిచ్చే అవకాశం ఉందని వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. ప్లే‌బ్యాక్ స్పీ్డ్ పెంచడం వాయిస్ మెస్సేజ్ పంపించిన వారి వాయిస్ ఏమాత్రం మారకపోవడం గమనార్హం. 

Also Read: WhatsApp Privacy Policy: వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఏం జరుగుతుందో తెలుసా

వాట్సాప్ ఫాస్ట్ ప్లే‌బ్యాక్ ఫీచర్ ఆన్ చేసి వినియోగించే విధానం

1. వినియోగదారులు ముందుగా WhatsApp ఓపెన్ చేయాలి. 

2. వాయిస్ మెస్సేజ్ ప్లే చేయాలి

3. ఆ తరువాత కుడివైపు 1x మీద క్లిక్ చేస్తే వాట్సాప్ ఫాస్ట్ ప్లే‌బ్యాక్ ఫీచర్ పనిచేస్తుంది

4. అక్కడ క్లిక్ చేసిన తరువాత వాయిస్ మెస్సేజ్ ప్లేబ్యాక్ స్పీడ్ 1.5 రెట్లు పెరుగుతుంది. అదే ఐకాన్ మీద రెండు పర్యాయాలు క్లిక్ చేస్తే 2 రెట్లు వేగంగా వాయిస్ మెస్సేజ్ వినవచ్చు. 

5. 2x icon మీద మరోసారి క్లిక్ చేస్తే యథావిధంగా మీకు రెగ్యూలర్ ఫార్మాట్ వేగంతో వాయిస్ మెస్సేజ్ వినిపిస్తాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
WhatsApps Fast Playback Feature: Is Useful to speed up voice message in WhatsApp
News Source: 
Home Title: 

WhatsApps Fast Playback Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్, ఇకపై ఆ వేగం పెరుగుతుంది

WhatsApps Fast Playback Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్, ఇకపై ఆ వేగం పెరుగుతుంది
Caption: 
WhatsApps Fast Playback feature
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
WhatsApps Fast Playback Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్, ఇకపై ఆ వేగం పెరుగుతుంది
Shankar Dukanam
Publish Later: 
No
Publish At: 
Sunday, June 6, 2021 - 10:51
Request Count: 
80
Is Breaking News: 
No